Andhra News: శ్రీశైలం మార్గంలో పెద్దపులి హల్‌ చల్‌.. సెల్‌పోన్లలో చిత్రీకరించిన యాత్రీకులు

శ్రీశైలం నల్లమల అడవిలో పెద్దపులి పగటిపూట రహదారిపై హల్‌ చల్‌ చేసింది. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చింతల - తుమ్మలబైలు ఘాట్‌ రోడ్‌లో పెద్దపులి రోడ్డు దాటుతూ వాహనదారులకు కనిపించింది.

Published : 05 Nov 2022 01:48 IST

దోర్నాల: శ్రీశైలం నల్లమల అడవిలో పెద్దపులి పగటిపూట రహదారిపై హల్‌ చల్‌ చేసింది. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చింతల - తుమ్మలబైలు ఘాట్‌ రోడ్‌లో ఇవాళ ఉదయం పెద్దపులి రోడ్డు దాటుతూ వాహనదారులకు కనిపించింది. పులిని చూసిన వాహనదారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వాహనాలను చూసిన పులి భయంతో రోడ్డుపై కొంతదూరం పరుగెత్తి అడవిలోకి వెళ్లిపోయింది. దోర్నాల నుంచి శ్రీశైలం వైపు వెళ్తున్న యాత్రికులు ఈ దృశ్యాలను సెల్‌ఫోన్‌లలో బంధించారు. శీతాకాలం కావడంతో పెద్దపులి రోడ్డుపైకి వస్తుందని స్థానికులు చెబుతున్నారు. గతేడాది ఇదే సీజన్లో పెద్దపులి శ్రీశైలం సమీపంలోని సాక్షిగణపతి ఆలయం వద్ద యాత్రికులకు కనిపించింది. పెద్ద పులులు తరచు కనిపించడం నల్లమలలో పులుల సంఖ్య పెరుగుతుందన్న వాదనకు బలం చేకూరుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని