KTR: అమెరికాలో సదస్సుకు మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం

ప్రపంచ పర్యావరణ నీటి వనరుల సదస్సుకు హాజరు కావాలని అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ సివిల్ ఇంజినీర్స్‌-ఎన్వైర్మెంటల్‌ అండ్‌ వాటర్‌ రిసోర్స్‌ ఇన్‌స్టిట్యూట్‌.. మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించింది.

Published : 29 Jan 2023 18:20 IST

హైదరాబాద్‌: ప్రపంచ పర్యావరణ నీటి వనరుల సదస్సుకు హాజరు కావాలని అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ సివిల్ ఇంజినీర్స్‌-ఎన్వైర్మెంటల్‌ అండ్‌ వాటర్‌ రిసోర్స్‌ ఇన్‌స్టిట్యూట్‌.. మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించింది. ఇటీవల సంస్థకు సంబంధించిన పలు బృందాలు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన విధానం, సౌకర్యాలు, వేగంగా నిర్మాణం పూర్తి చేసిన విధానం సంస్థ బృందాన్ని ఆకట్టున్నాయి. దీంతో ఆ సంస్థ ఎండీ బ్రెయిన్‌ పార్సన్స్‌ మంత్రి కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మే 21 నుంచి 25 వరకు అమెరికాలోని హెండర్సన్‌ నేవడలో జరగనున్న సదస్సులో ప్రసంగించాలని మంత్రి కేటీఆర్‌ను కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని