ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి అచ్చెన్నాయుడు

మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని పోలీసులు రమేశ్‌ ఆస్పత్రి నుంచి ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి తరలించనున్నారు. ఈఎస్‌ఐ కుంభకోణం ఆరోపణలతో అరెస్టైన అచ్చెన్నాయుడు.. అనారోగ్యం కారణంగా రమేశ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవల

Published : 17 Aug 2020 21:29 IST

గుంటూరు: మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని పోలీసులు రమేశ్‌ ఆస్పత్రి నుంచి ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి తరలించనున్నారు. ఈఎస్‌ఐ కుంభకోణం ఆరోపణలతో అరెస్టయిన అచ్చెన్నాయుడు.. అనారోగ్యం కారణంగా రమేశ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవల అచ్చెన్నాయుడికి కరోనా సోకినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై రమేశ్‌ ఆస్పత్రి నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగా అచ్చెన్నాయుడిని ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి తరలించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. దీంతో పోలీసులు ఆయన్ను ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని