Acidity: అసిడిటీ సమస్యా! ఇంటి వైద్యమే మేలండీ!

తిన్న ఆహారం జీర్ణం కాక ఎంతోమంది ఇబ్బంది పడుతుంటారు. దీంతో అసిడిటీ సమస్య అధికమవుతుంది. ఈ సమస్యను దూరం చేసుకునేందుకు రకరకాల మందులు వాడుతుంటారు. కానీ ఇంట్లో ఉండే వాటితోనే కడుపులో మంటను తగ్గించుకోండి. అవేంటో తెలుసుకోండి. 

Published : 25 Oct 2022 14:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తినే ఆహారంలో కాస్త కారం ఎక్కువైందంటే చాలు.. కడుపులో మంట మొదలవుతుంది. రసం పుల్లగా ఉందంటే ఇబ్బందే. జంక్‌ ఫుడ్‌ తిన్నారంటే రాత్రి పూట నిద్ర కూడా పట్టదు. మసాలాలు తినడం వల్ల వచ్చే తిప్పలు ఎన్నో ఉంటాయి. అలా అని తినకుండా ఉండలేరు. రుచిగా తినాలని అందరికీ ఉంటుంది. కానీ సాధ్యపడటం లేదా! ఆహారం జీర్ణం కాక చాలామంది మందులు కూడా వాడుతుంటారు. ఆరోగ్యంగా ఉంటూనే నచ్చిన ఆహారాన్ని తిని సులువుగా జీర్ణం చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఆ విషయాలేంటో మీరు తెలుసుకొని అసిడిటీ సమస్య రాకుండా జాగ్రత్త పడండి. 

* ఔషధాల గనిగా పేరొందిన తులసి మన ఆరోగ్యాన్ని రక్షించే మంచి నేస్తం. ఇది శరీరానికి యాంటీబయోటిక్‌ గా పని చేస్తుంది. తులసి రసాన్ని రోజూ తాగటం వల్ల దగ్గు, జలుబు వంటి సమస్యలు కూడా దరి చేరకుండా ఉంటాయి. అసిడిటీ సమస్యను దూరం చేస్తుంది.

* ఉదయం లేచిన వెంటనే గోరు వెచ్చని నీళ్లు తాగటం వల్ల జీర్ణ వ్యవస్థ చక్కగా పని చేస్తుంది. ఏదైనా ఆహారం తిన్న తర్వాత కడుపులో మంటగా, నొప్పిగా ఉన్నపుడు ఓ గ్లాసు గోరు వెచ్చని నీటిని తీసుకోవటం వల్ల మంచి ఉపశమనం ఉంటుంది. 

* చిన్నపాటి బెల్లం ముక్క చూడగానే నోరూరుతుంది కదా! ఇది రుచితో పాటు శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. తిన్న ఆహారం జీర్ణం కాకున్నా, కడుపులో మంటగా ఉన్నా బెల్లం తినేయండి. దీంతో త్వరిత ఉపశమనం ఉంటుంది. ఆరోగ్యంగానూ ఉంటారు. 

* మజ్జిగ వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. ఇందులో ఉండే లాటిక్‌ ఆమ్లం ఆహారం జీర్ణం చేసేందుకు దోహదపడుతుంది. 

* ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడంలో సోంపు గింజలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. భోజనం చేసిన తర్వాత సోంపు గింజలు తినాలి.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని