Wine Shop: మద్యం దుకాణం ఎదుట మహిళల ఆందోళన

గ్రామం మద్యంలో ఉన్న మద్యం దుకాణాన్ని తక్షణమే తొలగించాలని డిమాండ్‌ చేస్తూ విజయనగరం జిల్లాలో మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.

Published : 07 Oct 2023 22:31 IST

గజపతినగరం: గ్రామం నడిబొడ్డున ఉన్న మద్యం దుకాణాన్ని తక్షణమే తొలగించాలని డిమాండ్‌ చేస్తూ.. విజయనగరం జిల్లా గజపతినగరం మండలం మరుపల్లిలో మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వైన్‌షాపు వల్ల మహిళలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందని వెంటనే ఆ దుకాణాన్ని తొలగించాలని కోరారు. ‘ వైన్‌ షాపు మాకొద్దు’ అంటూ నినాదాలు చేశారు. ఈ దుకాణం వల్ల సాయంత్రం అయితే చాలు బయటకు రాలేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనేందుకు మరుపల్లి వచ్చిన ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్యకు తమ గోడు వెల్లబోసుకున్నారు. సానుకూలంగా స్పందించిన ఆయన.. 15 రోజుల్లోగా మద్యం దుకాణాన్ని తొలగిస్తానని హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని