Andhra news: రూ.13 లక్షల కోట్లు వస్తాయని చెప్పలేం: అమర్నాథ్‌

విశాఖ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో జరిగిన రూ.13 లక్షల కోట్ల ఒప్పందాల్లో వందశాతం వాస్తవరూపం దాల్చుతాయని చెప్పలేమని మంత్రి గుడివాడ అమర్నాథ్‌ అన్నారు.

Published : 04 Mar 2023 01:44 IST

విశాఖపట్నం: విశాఖ వేదికగా ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు (గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌)లో చేసుకున్న రూ.13 లక్షల కోట్ల ఒప్పందాల్లో వందశాతం వాస్తవరూపం దాల్చుతాయని చెప్పలేమని ఏపీ పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. కనీసం 80శాతం ఒప్పందాలైనా కార్యరూపం దాల్చే అవకాశముందన్నారు. సదస్సులో 14 రంగాల మీద దృష్టి సారించగా 20 రంగాల్లో పెట్టుబడులు వచ్చాయని ఆయన చెప్పారు. శుక్రవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌ బ్రాండ్‌కు ఉన్న నమ్మకం వల్లే ఇన్ని పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు.

నాలుగేళ్లుగా పరిశ్రమలను వెళ్లగొట్టి ఇప్పుడు నిద్రలేస్తే ప్రయోజనం ఏంటన్న  తెదేపా నేతల విమర్శలపై అమర్నాథ్‌ మండిపడ్డారు. ‘‘ తెదేపా నేతల విమర్శలు దారుణం. అంబానీ, జిందాల్‌ ఎవరో అచ్చెన్నాయుడికి తెలుసా? తెదేపా హయాంలో ఎప్పుడైనా ఇంతమంది పారిశ్రామిక వేత్తలు ఒక వేదికపైకి వచ్చారా? ఒక్క రోజులోనే రూ.13 లక్షల కోట్ల ఒప్పందాలు సాధించాం. 14 రంగాల్లో దృష్టి పెట్టాం. కానీ, 20 సెక్టార్లలో పెట్ట్టుబడులు వచ్చాయి. జగన్‌ బ్రాండ్‌కి ఉన్న నమ్మకం వల్లే ఇన్ని పెట్టుబడులు వచ్చాయి.’’ అని అమర్నాథ్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని