Amravati Maha Padayatra: అమరావతి పరిరక్షణే ధ్యేయంగా.. 17వ రోజుకు రైతుల మహాపాదయాత్ర

అమరావతి పరిరక్షణ కోసం రాజధాని ప్రాంత రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర 17వ రోజుకు చేరుకుంది.

Updated : 28 Sep 2022 16:24 IST

దెందులూరు: అమరావతి పరిరక్షణ కోసం రాజధాని ప్రాంత రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర 17వ రోజుకు చేరుకుంది. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో ఇది కొనసాగుతోంది. పెదపాడు మండలం కొత్తూరు నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. అమరావతి రథం వద్ద జేఏసీ నాయకులు పూజలు చేసిన అనంతరం యాత్రను ప్రారంభించారు. పలువురు తెదేపా, జనసేన నేతలు, వివిధ సంఘాల ప్రతినిధులు పాదయాత్రకు సంఘీభావం తెలిపారు.

తెదేపా జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, ఏలూరు నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జ్‌ బడేటి చంటి, ఏలూరు నియోజకవర్గ జనసేన నేతరెడ్డి అప్పలనాయుడు తదితరులు పాద్రయాత్రలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు