E-Mobility: టేబుల్ మీద తింటూ.. టేబుల్‌తో సహా ప్రయాణించి..!

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా షేర్ చేసే వీడియోల్లో హాస్యం ఎంతుంటుందో.. మెదడుకు పనిచెప్పే విషయమూ అంతే ఉంటుంది.

Published : 05 Jul 2022 01:57 IST

ముంబయి: ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా షేర్ చేసే వీడియోల్లో హాస్యం ఎంతుంటుందో.. మెదడుకు పనిచెప్పే విషయమూ అంతే ఉంటుంది. తాజాగా ఆయన పంచుకున్న వీడియో కూడా అంతే నవ్వులు పూయిస్తోంది. అలాగే సరికొత్త సాంకేతికత గురించి తెలియజేసేలా ఉంది. 

ఆ వీడియోలో నలుగురు వ్యక్తులు ఒక టేబుల్ చుట్టూ కూర్చొని తమకిష్టమైన ఆహారాన్ని ఆరగిస్తున్నారు. అయితే ఆ టేబుల్ ఉంది రెస్టారెంట్‌లో కాదు.. గ్యాస్‌ స్టేషన్ వద్ద. వారు ఒకవైపు నచ్చింది తింటూ.. ఆ టేబుల్‌తో సహా గ్యాస్‌ స్టేషన్‌కు వచ్చి, ఇంధనం నింపుకొన్నారు. తర్వాత వారిలో ఒకరు ఆ మొబైల్ టేబుల్‌ను స్టార్ట్ చేయడంతో.. దాంతో సహా వారు చేరుకోవాల్సిన ప్రదేశానికి వెళ్లిపోయారు. తింటూనే వారు ప్రయాణించారు. ఈ వీడియో మహీంద్రాను అబ్బురపరిచింది. ‘దీనినే ఇ-మొబిలిటీ(e-mobility) అంటారనుకుంటున్నాను. ఇక్కడ ఇ అంటే ఆరగించడం’ అని చమత్కరించారు. ఈ వీడియోను నెట్టింట్లో షేర్ చేయగా.. నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని