Anil kumar Singhal: ఏపీ గవర్నర్‌ ముఖ్యకార్యదర్శిగా అనిల్‌కుమార్‌ సింఘాల్‌

ఏపీ గవర్నర్‌ ముఖ్యకార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ (Anil kumar Singhal) బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు.

Published : 04 Feb 2023 18:23 IST

అమరావతి: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఎఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. 1993 బ్యాచ్‌కు చెందిన సింఘాల్‌ ఇప్పటి వరకు దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం గవర్నర్ బిశ్వభూషణ్‌ను సింఘాల్‌ మర్యాద పూర్వకంగా కలిశారు. సింఘాల్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో కీలకమైన శాఖలలో బాధ్యతలు నిర్వర్తించి గుర్తింపు పొందారు. కేంద్రంలో అత్యంత కీలకమైన డీవోపీటీ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఏపీ భవన్ ప్రత్యేక కమిషనర్‌గా పని చేశారు. కీలకమైన కరోనా సమయంలో వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిగా సేవలు అందించి రాష్ట్ర ప్రజల మన్ననలు అందుకున్నారు. తితిదే ఈవోగా పలు సంస్కరణలకు బీజం వేశారు. విశాఖపట్నం, తూర్పు గోదావరి, మెదక్ కలెక్టర్‌గా, చిత్తూరు, గుంటూరు సంయుక్త కలెక్టర్‌గా అయా జిల్లాల్లో తనదైన ముద్ర వేశారు. సర్వీసు తొలి రోజుల్లో నెల్లూరు, అనంతపురం ఉప కలెక్టర్‌గా పని చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని