CM Jagan: కృష్ణానదిపై రూ.2,500 కోట్లతో మరో బ్యారేజీ: సీఎం జగన్
కృష్ణానదిపై మరో బ్యారేజీ నిర్మాణం చేపట్టనున్నట్టు సీఎం జగన్ వెల్లడించారు. భట్టిప్రోలు మండల పరిధిలోని ఓలేరు- తూర్పుపాలెం మధ్య రూ.2,500 కోట్లతో నిర్మించనున్నట్టు చెప్పారు.
బాపట్ల: బాపట్ల జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వేమూరు నియోజకవర్గ ప్రజలకు పలు హమీలు గుప్పించారు. భట్టిప్రోలు మండల పరిధిలోని ఓలేరు- తూర్పు పాలెం గ్రామాల మధ్య కృష్ణానదిపై బ్యారేజీ నిర్మిస్తామన్నారు. 4.96 టీఎంసీల సామర్థ్యంలో నిర్మించే ఈ బ్యారేజీకి రూ.2,500 కోట్లతో ప్రతిపాదనలు పూర్తయినట్టు చెప్పారు. జంపని చక్కెర కర్మాగారం కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వేమూరు నియోజకవర్గంలో రూ.17కోట్లతో రహదారులు నిర్మిస్తామన్నారు. 1800 ఎకరాల లంక భూములకు పట్టాలు ఇవ్వటం ద్వారా 3,749 మంది రైతులకు మేలు చేయనున్నట్టు వెల్లడించారు. యడ్లపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలను జూనియర్ కాలేజీగా అప్‌గ్రేడ్ చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
భారత్‌కు తిరిగి రానున్న శివాజీ ‘పులి గోళ్లు’!
-
‘సీఎం ఇంటికి కూతవేటు దూరంలోనే స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం’
-
కన్నవారి నడుమ కుదరని ఏకాభిప్రాయం.. మూడేళ్ల చిన్నారికి పేరు పెట్టిన హైకోర్టు
-
Chandrababu: జైలులో నేడు చంద్రబాబు దీక్ష
-
తిరుమలలో బ్రేక్ దర్శనం, గదుల బుకింగ్‌కు ‘పే లింక్’ సందేశాలతో నగదు చెల్లింపు!
-
విశాఖలో పిడుగు పాటు.. వీడియో వైరల్