Corona: ఏపీలో భారీగా కొత్త కేసులు 

ఏపీలో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతోంది. కఠిన లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నా వాయువేగంతో ....

Updated : 19 May 2021 18:45 IST

అమరావతి: ఏపీలో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతోంది. కఠిన లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నా వాయువేగంతో వైరస్‌ వ్యాప్తి చెందుతోంది. కొత్తగా 23వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24గంటల వ్యవధిలో  1,01,330 శాంపిల్స్‌ పరీక్షించగా.. 23,160మందికి పాజిటివ్‌గా తేలింది. అలాగే, కొత్తగా 106 మంది మృతిచెందగా.. మరో 24,819మంది కోలుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం.. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,82,41,637శాంపిల్స్‌ పరీక్షించగా..  14,98,532మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో 12,79,110మందికోలుకొని డిశ్చార్జి కాగా.. 9686మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,09,736 క్రియాశీల కేసులు ఉన్నాయి. 

పశ్చిమగోదావరిలో అధిక మరణాలు
రాష్ట్రంలో పశ్చిమగోదావరి జిల్లాలో అత్యధికంగా 17మంది కొవిడ్‌తో మృతిచెందగా.. విశాఖ, నెల్లూరులో 11మంది చొప్పున ప్రాణాలు కోల్పోయారు. అలాగే, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో తొమ్మిది మంది చొప్పున; అనంతపురం, చిత్తూరు, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో ఎనిమిది మంది చొప్పున మృత్యువాతపడ్డారు. గుంటూరులో ఏడుగురు, కర్నూలులో ఐదుగురు, ప్రకాశం జిల్లాలో నలుగురు, కడప జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

రాష్ట్రంలో కరోనా పరిస్థితి (జిల్లాల వారీగా) ఇలా..
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని