Andhra News: కొత్త జిల్లాల్లో భూముల మార్కెట్‌ విలువల సవరణ.. ప్రభుత్వం ఆమోదం

కొత్తగా ఏర్పడిన 13 జిల్లాల్లో భూముల మార్కెట్ విలువలను సవరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఏర్పడిన జిల్లాలు, జిల్లా కేంద్రాల సమీప ప్రాంతాల్లోని భూముుల విలువను ఈ నెల 6వ తేదీ నుంచి సవరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్రామీణ, పట్టణ..

Published : 04 Apr 2022 18:03 IST

అమరావతి: కొత్తగా ఏర్పడిన 13 జిల్లాల్లో భూముల మార్కెట్ విలువలను సవరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఏర్పడిన జిల్లాలు, జిల్లా కేంద్రాల సమీప ప్రాంతాల్లోని భూముుల విలువను ఈ నెల 6వ తేదీ నుంచి సవరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని భూముల మార్కెట్ విలువలను సవరించాల్సిందిగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ నుంచి వచ్చిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నెల 6 నుంచి కొత్త మార్కెట్ విలువలను సవరించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మార్కెట్ విలువలకు అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెరగనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని