Ap News: రాజధాని రైతుల మహా పాదయాత్రకు హైకోర్టు అనుమతి

అమరావతి ఉద్యమాన్ని విస్తృతం చేసే క్రమంలో రాజధాని రైతులు మహా పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. నవంబరు 1 నుంచి  ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు

Updated : 29 Oct 2021 18:48 IST

అమరావతి: అమరావతి ఉద్యమాన్ని విస్తృతం చేసే క్రమంలో రాజధాని రైతులు మహా పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. నవంబరు 1 నుంచి  ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు’ పేరుతో 45 రోజుల పాటు పాదయాత్ర చేయాలని అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని రైతు ఐకాస నిర్ణయించాయి. దీంతో పాదయాత్రకు పోలీసుల అనుమతి కోరారు. శాంతిభద్రతల దృష్ట్యా మహా పాదయాత్రకు అనుమతివ్వలేమని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అమరావతి పరిరక్షణ సమితికి లేఖ రాశారు. దీంతో మహా పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ రాజధాని రైతులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు రైతుల మహా పాదయాత్రకు అనుమతిచ్చింది. పాదయాత్రకు హైకోర్టు అనుమతివ్వడం పట్ల రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని