AP High Court: ఐఏఎస్‌ శ్రీలక్ష్మి పిటిషన్‌ కొట్టేసిన హైకోర్టు

తన శిక్షను పునఃపరిశీలించాలని కోరుతూ ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది.

Published : 13 Apr 2022 14:19 IST

అమరావతి: తన శిక్షను పునఃపరిశీలించాలని కోరుతూ ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. హాస్టళ్లలో సామాజిక సేవ చేయాలని గతంలో ఉన్నత న్యాయస్థానం ఆమెను ఆదేశించింది. మరోవైపు కొద్ది రోజుల కిందట ఈ పిటిషన్‌ను దాఖలు చేసిన సమయంలో రిజిస్ట్రీ ఈ పిటిషన్‌ విచారణ అర్హతపై సందేహం వ్యక్తం చేస్తూ నంబర్‌ కేటాయించడానికి నిరాకరించారు. దీంతో శ్రీలక్ష్మి తరఫు న్యాయవాది కోర్టుకు వివరణ ఇచ్చారు. హైకోర్టులో గతంలో ఇటువంటి పిటిషన్లపై విచారణ జరిపారని చెప్పారు. ఈ నేపథ్యంలో పిటిషన్‌ను స్వీకరించి ఇవాళ విచారణ చేపట్టిన ధర్మాసనం దాన్ని కొట్టేసింది.

ప్రభుత్వ పాఠశాలల్లో గ్రామ, వార్డు సచివాలయాల తొలగింపునకు గతంలో హైకోర్టు ఆదేశించింది. ఆ ఉత్తర్వులు పట్టించుకోకపోవడంపై శ్రీలక్ష్మితో సహా ఎనిమిది మంది ఐఏఎస్‌ అధికారులకు శిక్ష విధించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని