Botsa Satyanarayana: ఆందోళనలు విరమించండి.. అంగన్‌వాడీ సంఘాలతో చర్చలు జరిపిన మంత్రి బొత్స

సమ్మెలో ఉన్న అంగన్‌వాడీలు తిరిగి విధుల్లో చేరాలని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. మరోసారి అంగన్‌వాడీ సంఘాలతో ఈమేరకు ఆయన చర్చలు జరిపారు. 

Updated : 23 Jan 2024 00:53 IST

అమరావతి: సమ్మెలో ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు వెంటనే ఆందోళన విరమించి, విధుల్లో చేరాలని మంత్రి బొత్స సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. అంగన్‌వాడీ సంఘాలతో మంత్రి బొత్స మరోసారి చర్చలు జరిపారు. తమ సమస్యల పరిష్కారం కోసం 42 రోజులుగా అంగన్‌వాడీలు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ‘చలో విజయవాడ’ కార్యక్రమం నేపథ్యంలో ఎక్కడికక్కడ అంగన్‌వాడీలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఈ నెల 24న ఏపీ బంద్‌కు ఆ సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరోసారి అంగన్‌వాడీ సంఘాలను చర్చలకు పిలిచింది.

యథావిధిగా విధులకు హాజరుకావాలని మంత్రి బొత్స అంగన్‌వాడీ సంఘాలకు విజ్ఞప్తి చేశారు. చాలా జిల్లాల్లో అంగన్‌వాడీలు విధులకు హాజరవుతున్నారని, మిగతా సిబ్బంది కూడా విధుల్లో చేరాలని కోరారు. అంగన్‌వాడీల ఆందోళన సమయంలో అనేక డిమాండ్లను అంగీకరించామని, మిగిలిన వాటిపట్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. రెండు దఫాలు అంగన్‌వాడీలతో చర్చలు జరిగాయని, వారి 11 డిమాండ్లలో పదింటిని నెరవేర్చేందుకు అంగీకరించినట్లు తెలిపారు. వేతనాలు పెంచాలనే డిమాండ్‌ను వచ్చే ఆర్థిక సంవత్సరంలో నెరవేరుస్తామని చెప్పినట్లు మంత్రి బొత్స పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని