Mogalturu: కృష్ణంరాజు స్మృతివనం ఏర్పాటుకు రెండెకరాల స్థలం: మంత్రి కారుమూరు

ప్రముఖ సినీనటుడు కృష్ణంరాజు మరణంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారని ఏపీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు అన్నారు.

Updated : 29 Sep 2022 14:43 IST

మొగల్తూరు: ప్రముఖ సినీనటుడు కృష్ణంరాజు మరణంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారని ఏపీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు అన్నారు. ఆయన పేరిట స్మృతివనం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రెండెకరాల స్థలాన్ని కేటాయిస్తుందని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులోని కృష్ణంరాజు స్వగృహంలో ఏర్పాటు చేసిన సంస్మరణ సభకు మంత్రులు రోజా, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ప్రసాదరాజుతో కలిసి కారుమూరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినీ, రాజకీయ రంగాల్లో రాణించిన రెబల్‌స్టార్‌ మృతి తీరని లోటు అని చెప్పారు. స్మృతివనం ఏర్పాటు విషయాన్ని కృష్ణంరాజు కుటుంబసభ్యులకు తెలిపామన్నారు. 

పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ రెబల్‌స్టార్‌ మృతి తీరని లోటు అని.. ప్రజల హృదయాల్లో ఆయన సుస్థిరస్థానం సంపాదించుకున్నారని చెప్పారు. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారని కొనియాడారు. చిన్న అవినీతి మరక లేకుండా రాజకీయాల్లో కృష్ణంరాజు తనదైన ముద్ర వేసుకున్నారన్నారు. ప్రతి గ్రామానికీ అభివృద్ధి నిధులు ఇచ్చారని.. ఆయన ఆశయసాధనకు కృషి చేస్తామని చెప్పారు. 

ఈ సంస్మరణ సభకు పెద్ద ఎత్తున కృష్ణంరాజు, ప్రభాస్‌ అభిమానులు తరలివచ్చారు. దీంతో మొగల్తూరు ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని