Pedanandipadu: ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు.. రైతుయాత్రను అడ్డుకున్న పోలీసులు

గుంటూరు వాహిని కాలువ పొడిగించేందుకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ రైతులు చేపట్టిన రైతుయాత్రను పోలీసులు అడ్డుకున్నారు.

Updated : 01 Aug 2023 18:44 IST

పెదనందిపాడు: గుంటూరు వాహిని కాలువ పొడిగించేందుకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ రైతులు చేపట్టిన రైతుయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. నల్లమడ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతుయాత్రకు పిలుపునిచ్చారు. నిధుల విడుదల కోసం సీఎం జగన్‌ను కలవాలని రైతులు నిర్ణయించారు. దీనిలో భాగంగా పెదనందిపాడు నుంచి యాత్రగా వెళ్లేందుకు సిద్ధమవగా అనుమతి లేదంటూ పోలీసులు ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. 

సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లే మార్గంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పలువురు రైతు నేతలను గృహనిర్బంధం చేశారు. పెదనందిపాడు, నాగులపాడు, వరగాని, ప్రత్తిపాడు, ఏటుకూరు వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంటలో ఆటోలు, ఆర్టీసీ బస్సులు, లారీల్లో పోలీసులు తనిఖీ చేశారు. చిలకలూరిపేట-పర్చూరు రహదారుల్లో వాహనాల తనిఖీ చేపట్టారు. అనంతరం పలువురు రైతులను అరెస్ట్‌ చేసి పెదనందిపాడు పీఎస్‌కు తరలించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని