‘‘ఇప్పుడొచ్చే ఆదాయం డీజిల్‌కే ఖర్చవుతోంది’’

ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లాల ఆర్‌ఎంలతో ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆర్టీసీ సిబ్బందిపై కరోనా ప్రభావం, వైరస్‌ వ్యాప్తి, ఆర్టీసీ పరిస్థితి, ప్రజలకు సేవలు అందిస్తూనే సంస్థ ఆదాయం పెంచుకునే మార్గాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ

Published : 29 Jul 2020 00:52 IST

ఏపీఎస్ఆ‌ర్టీసీ ఎండీ కృష్ణబాబు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లోని ఆర్టీసీ ఆర్‌ఎంలతో ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆర్టీసీ సిబ్బందిపై కరోనా ప్రభావం, వైరస్‌ వ్యాప్తి, ఆర్టీసీ పరిస్థితి, ప్రజలకు సేవలు అందిస్తూనే సంస్థ ఆదాయం పెంచుకునే మార్గాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ మాట్లాడుతూ ‘‘మే 21 నుంచి 30శాతం బస్సులే నడుస్తున్నాయి. కరోనా భయంతో ఆర్టీసీ ఆదాయం బాగా తగ్గింది. ప్రస్తుతం వచ్చే ఆదాయం డీజిల్‌ ఖర్చుకే సరిపోతోంది. కరోనా సోకకుండా ఆర్టీసీ సిబ్బంది రక్షణకు చర్యలు తీసుకోవాలి. కరోనా సోకిన ఆర్టీసీ ఉద్యోగులకు మెరుగైన చికిత్స అందించాలి. అవసరాల మేరకు బస్సుల తగ్గింపు, పెంపుపై సమీక్షించాలి. కరోనా వల్ల తగ్గిన ఆదాయాన్ని ప్రత్యామ్నాయ మార్గాల్లో భర్తీ చేయాలి. సరకు రవాణాతో ఆదాయం భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలి. బస్టాండ్ల పరిశుభ్రత, ప్రయాణికుల సౌకర్యాలపై మరింత దృష్టి పెట్టాలి’’అని జిల్లాల ఆర్‌ఎంలకు ఎండీ కృష్ణబాబు దిశానిర్దేశం చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని