Andhra News: ప్రభుత్వం మోసం చేస్తున్నందునే ఉద్యమ కార్యాచరణ: బొప్పరాజు వెంకటేశ్వర్లు

ప్రభుత్వం తమను అన్నిరకాలుగా మోసం చేస్తున్నందునే వచ్చే నెల 5 నుంచి అన్ని ఉద్యోగ సంఘాలతో చర్చించి ఉద్యమ కార్యాచరణ వెల్లడిస్తామని ఏపీ అమరావతి ఐకాస ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు.

Published : 29 Mar 2023 16:34 IST

గుంటూరు: సీపీఎస్‌పై ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని ఏపీ అమరావతి ఐకాస ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయంలో బొప్పరాజు ఉద్యోగులతో సమావేశమయ్యారు. వచ్చేనెల 5 నుంచి చేపట్టబోయే ఉద్యమ వివరాలను ఉద్యోగులకు వివరించారు. చట్టపరంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులనే అడుగుతున్నామని బొప్పరాజు చెప్పారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకుండా ప్రభుత్వం నాన్చివేత ధోరణి అవలంభిస్తోందని ఆరోపించారు. పీఆర్‌సీ నుంచి డీఏ వేరు చేసి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగికి ఏటా రావాల్సిన డీఏను పీఆర్సీతో కలిపి ఇస్తామనడం తమను మోసం చేయడమేనన్నారు. ప్రభుత్వం తమను అన్నిరకాలుగా మోసం చేస్తున్నందునే వచ్చే నెల 5 నుంచి అన్ని ఉద్యోగ సంఘాలతో చర్చించి ఉద్యమ కార్యాచరణ వెల్లడిస్తామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని