Viveka Murder Case: వైకాపా ఎంపీ అవినాష్‌రెడ్డికి మళ్లీ సీబీఐ నోటీసులు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా ఎంపీ అవినాష్‌రెడ్డి సీబీఐ రెండోసారి నోటీసులు జారీ చేసింది.
కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా ఎంపీ అవినాష్‌రెడ్డి సీబీఐ రెండోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది.
అవినాష్‌రెడ్డికి మూడు రోజుల క్రితమే మొదటిసారి సీబీఐ నోటీసులు అందజేసింది. మంగళవారం (24వ తేదీ) విచారణకు రావాలని ఆదేశించింది. అయితే ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉండటం వల్ల ఆరోజు తాను రాలేననని చెప్పారు. ‘నిన్న నోటీసులు ఇచ్చి.. నేడు విచారణకు రమ్మంటే ఎలా?’ అని మంగళవారం ఆయన వ్యాఖ్యానించారు. విచారణకు హాజరయ్యేందుకు ఐదు రోజుల సమయం కావాలని అవినాష్‌రెడ్డి కోరారు.
ఈ నేపథ్యంలో రెండోసారి సీబీఐ నోటీసులు జారీ చేస్తూ 28న విచారణకు రావాల్సిందిగా ఆదేశించింది. దాదాపు రెండున్నరేళ్లుగా కేసును దర్యాప్తు చేస్తున్న దర్యాప్తు సంస్థ.. ఇప్పటివరకూ ఒక్కసారీ ఆయనను ప్రశ్నించలేదు. కడప నుంచి హైదరాబాద్‌కు కేసు బదిలీ అయిన తర్వాత తాజాగా విచారణ మొదలుపెట్టిన సీబీఐ.. అవినాష్‌కు నోటీసులిచ్చింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Pakistan: పౌరులకు పాకిస్థాన్ షాక్.. పెట్రోల్‌పై ఒకేసారి రూ.35 పెంపు!
-
Sports News
U 19 World Cup: అండర్ - 19 మహిళల టీ20 ప్రపంచకప్ విజేతగా టీమ్ఇండియా
-
General News
Ts News: గుజరాత్లో పంచాయితీ సర్వీస్ పరీక్ష పేపర్ లీక్.. హైదరాబాద్‌లో ముగ్గురి అరెస్టు
-
India News
Vande Bharat Express: వందే భారత్ రైళ్లలో క్లీనింగ్ ప్రక్రియ మార్పు.. ఇకపై అలా చేయొద్దు ప్లీజ్!
-
Sports News
Virat - Babar: విరాట్‌తో ఎవరినీ పోల్చలేం: పాకిస్థాన్ మాజీ కెప్టెన్
-
Movies News
Samantha: తన బెస్ట్ ఫ్రెండ్స్‌ని పరిచయం చేసిన సమంత