నీటిపారుదలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల పురోగతిపై సమీక్షిస్తున్నారు. జల వివాదం

Updated : 06 Jul 2021 16:09 IST

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల పురోగతిపై సమీక్షిస్తున్నారు. జల వివాదం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రాజెక్టుల అంశంపై  సమావేశంలో చర్చిస్తున్నట్టు సమాచారం. ఈనెల 9న జరగబోయే కేఆర్‌ఎంబీ సమావేశం వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కేంద్రాన్ని కోరింది. ఈనేపథ్యంలో నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష ప్రాధాన్యం సంతరించుకుంది. సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్‌, ఈఎన్‌సీ మురళీధర్‌ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని