పాలమూరు ఎత్తిపోతలపై రెండో రోజు సమీక్ష

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై సీఎం కేసీఆర్‌ రెండోరోజూ సమీక్షించారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ పనులను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. కల్వకుర్తి, పాలమూరు ఎత్తిపోతల పథకాల విస్తరణకు...

Updated : 24 Sep 2022 15:17 IST

హైదరాబాద్‌: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై సీఎం కేసీఆర్‌ రెండోరోజూ సమీక్షించారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ పనులను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. కల్వకుర్తి, పాలమూరు ఎత్తిపోతల పథకాల విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. తాండూరు, వికారాబాద్‌ ప్రాంతాలకు గ్రావిటీ ద్వారా సాగునీరు ఇవ్వాలని సూచించారు. కల్వకుర్తి లిఫ్ట్‌ ఆయకట్టును పూర్తిగా స్థిరీకరించాలన్నారు. కర్ణాటక సరిహద్దు గ్రామాల భూములకు సాగునీరు ఇవ్వాలన్నారు. కాల్వలు, వాగుల ద్వారా నీటిని తీసుకెళ్లేందుకు చెక్‌ డ్యాములు పటిష్ఠం చేయాలని,   పాలమూరుపై పూర్తిగా దృష్టిసారించాలని అధికారులను ఆదేశించారు. అచ్చంపేట ఎత్తిపోతల పథకం సర్వే పనులు త్వరగా పూర్తిచేయాలని, పనుల అంచనాలను పరిపాలనా అనుమతుల కోసం పంపాలన్నారు. బల్మూరు, లింగాల, అమ్రాబాద్‌ ప్రాంతంలో 60 వేల ఎకరాలకు సాగునీరందించాలన్నారు. ఏదుల రిజర్వాయర్‌ నుంచి 22 కి.మీ కాల్వ తీసి, లింగాల వద్ద లిఫ్ట్‌ నిర్మించాలని సీఎం ఆదేశించారు. మైలారం వద్ద 3 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌,  మున్ననూరులో 1.4 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌ నిర్మించాలని సీఎం కేసీఆర్‌ అధికారులకు సూచించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని