IND vs AUS: హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్‌పై హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) అధ్యక్షుడు అజహరుద్దీన్‌పై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌(ఎస్‌హెచ్‌ఆర్‌సీ)కి...

Published : 23 Sep 2022 15:29 IST

హైదరాబాద్‌: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) అధ్యక్షుడు అజహరుద్దీన్‌పై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌(ఎస్‌హెచ్‌ఆర్‌సీ)కి ఫిర్యాదు అందింది. జింఖానా మైదానంలో గురువారం జరిగిన మ్యాచ్‌ టికెట్ల విక్రయంలో నిర్లక్ష్యం, అవినీతికి పాల్పడ్డారని.. వెంటనే ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేసి పదవి నుంచి తొలగించాలని బీసీ రాజకీయ ఐకాస ఛైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించారు. క్రీడాభిమానులపై లాఠీఛార్జికి కారకుడైన అజహరుద్దీన్‌తో పాటు హెచ్‌సీఏ నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు.

‘‘జింఖానా మైదానం వద్ద తొక్కిసలాటకు హెచ్‌సీఏతో పాటు ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రధాన కారణం. ఉప్పల్‌లో ఈనెల 25న జరగబోయే భారత్‌, ఆస్ట్రేలియా మూడో టీ20 మ్యాచ్‌ ఏర్పాట్ల విషయంలో హెచ్‌సీఏ పూర్తి వైఫల్యం చెందింది. క్రీడాభిమానుల నుంచి రూ. కోట్లు దండుకొని టికెట్ల విషయంలో సరైన ఏర్పాట్లు చేయలేదు. టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న వారికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి’’ అని ఆయన డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని