Telangana News: ఇంటర్మీడియట్‌లో మళ్లీ పూర్తి స్థాయి సిలబస్‌

ఇంటర్మీడియట్‌లో ఈ విద్యాసంవత్సరం నుంచి మళ్లీ పూర్తి స్థాయి సిలబస్‌ అమలు కానుంది. రెండేళ్లుగా కరోనా వల్ల తరగతులు సరిగా నిర్వహించలేకపోవడంతో

Updated : 24 Jun 2022 16:56 IST

హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌లో ఈ విద్యాసంవత్సరం నుంచి మళ్లీ పూర్తి స్థాయి సిలబస్‌ అమలు కానుంది. రెండేళ్లుగా కరోనా వల్ల తరగతులు సరిగా నిర్వహించలేకపోవడంతో  30శాతం సిలబస్‌ను తొలగించారు. దానికి అనుగుణంగానే ఎంసెట్‌లోనూ 70శాతం సిలబస్‌ నుంచే పరీక్ష నిర్వహించారు. కరోనా పరిస్థితులు కుదుట పడటతో పాత విధానాన్ని పునరుద్ధరిస్తున్నట్టు ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. ఈ విద్యాసంవత్సరంలో ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు వందశాతం సిలబస్‌ అమల్లో ఉంటుందని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ వెల్లడించారు. వివరాలు త్వరలో ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తామని స్పష్టం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని