Polavaram project: 2025 జూన్ నాటికి పోలవరం పూర్తి చేయాలని లక్ష్యం
పోలవరం ప్రాజెక్టును 2025 జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఏపీ నీటిపారుదల ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డి తెలిపారు.

దిల్లీ: పోలవరం ప్రాజెక్టును 2025 జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఏపీ నీటిపారుదల ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డి తెలిపారు. ఏడాది ముందుగానే నిర్మాణం పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నామని చెప్పారు. గురువారం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నేతృత్వంలో పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. పోలవరం పనుల పురోగతి, సహాయ, పునరావాస కార్యక్రమాల అమలుపై అధికారులతో చర్చించారు.
భేటీ అనంతరం సమీక్ష వివరాలను ఈఎన్సీ నారాయణరెడ్డి మీడియాకు వెల్లడించారు. అడహక్ నిధుల కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.17,414 కోట్లు కేంద్రాన్ని అడిగిందని తెలిపారు. దీనిపై కేంద్రం పరిశీలిస్తామని చెప్పిందన్నారు. 41.15 మీటర్ల ఎత్తు వరకు ఆర్అండ్ఆర్ నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరగా.. సానుకూలంగా స్పందించిందని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Rahul Gandhi: భారాస అంటే భాజపా రిస్తేదార్ సమితి: రాహుల్
-
TDP: ‘ఐప్యాక్‌కు రూ.274 కోట్లు అప్పనంగా దోచిపెట్టారు’
-
Jangaon: విద్యుత్తు స్తంభంపై కార్మికుని నరకయాతన
-
దిల్లీ మద్యం కేసులో అప్రూవర్లుగా మాగుంట రాఘవ్, దినేష్ అరోరా
-
RK Roja: తెదేపాను వీడినప్పటి నుంచి కక్ష కట్టారు: మంత్రి రోజా
-
YS Jagan: రేపు దిల్లీకి సీఎం జగన్.. హఠాత్తుగా సామర్లకోట పర్యటన వాయిదా