Cooking Vessles: ఏ పాత్రలో వండితే ఏం లాభమో తెలుసుకోండి!

పూర్వకాలంలో మట్టి పాత్రల్లో వంట చేసేవారు. పెరట్లో పండించిన కూరగాయలు తీసుకొచ్చి మట్టి పొయ్యి మీద వండుకుని తినేవారు. ప్రస్తుతం అన్నీ కృత్రిమంగానే తింటున్నామని చెప్పవచ్చు. మారుతున్న కాలంతో పాటు మన ఆహార అలవాట్లూ మారిపోయాయి. ఉరుకుల పరుగుల జీవితంలో అన్నీ ఆటోమాటిక్‌గా పని చేసేవాటినే వాడుతున్నాం.

Published : 28 Sep 2022 01:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పూర్వకాలంలో మట్టి పాత్రల్లో వంట చేసేవారు. పెరట్లో పండించిన కూరగాయలు తీసుకొచ్చి మట్టి పొయ్యి మీద వండుకుని తినేవారు. ప్రస్తుతం అన్నీ కృత్రిమంగానే తింటున్నామని చెప్పొచ్చు. మారుతున్న కాలంతో పాటు మన ఆహార అలవాట్లూ మారిపోయాయి. ఉరుకుల పరుగుల జీవితంలో అన్నీ ఆటోమాటిక్‌గా పని చేసేవాటినే వాడుతున్నాం. కానీ వంట ఎలా చేసుకోవాలి? ఎలాంటి పాత్రల్లో వంట చేసుకుని తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఏ పాత్ర ఏ ప్రయోజనాలు చేకూరుస్తుందో తెలుసుకుందామా!

ఇనుము..

ఇనుముతో చేసిన వంట పాత్రల్లో వంట చేసుకుని తినటం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ పాత్రల్లో వండిన వంటకానికి ఐరన్‌ పోషకాలు కూడా అందుతాయి. ప్రస్తుతం మార్కెట్లో ఐరన్‌ లోహంతో చేసిన పాత్రలు సరికొత్త డిజైన్లలో అందుబాటులో ఉన్న వాటిని ఉపయోగించండి. శరీరానికి కావాల్సిన ఐరన్‌ను పొందండి. 

కంచు...

కంచు మోత ఎంత ఎక్కువగా వస్తుందో దాంతో ఆరోగ్యానికి ప్రయోజనాలూ అదే స్థాయిలో ఉంటాయి. కంచుతో తయారు చేసిన పాత్రల్లో ఆహారం వండుకుని తినడం ద్వారా జీర్ణశక్తి మెరుగుపడుతుంది. థైరాయిడ్‌ను బ్యాలెన్స్‌ చేయడంలోనూ తోడ్పడుతుంది. 

ఇత్తడి..

ఇత్తడి పాత్రలు ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి. ఇతర లోహ పాత్రలతో పోలిస్తే ఈ పాత్రల్లో ఆహారం వండటం ద్వారా కేవలం 7శాతం మాత్రమే పోషకాలను కోల్పోతారని నిపుణులు చెబుతున్నారు. 

* రాగి..

ఆరోగ్యాన్ని అందించడంలో రాగి మనకు మంచి నేస్తం. రాగి పాత్రల్లోని నీరు తాగటం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది నీటిని శుద్ధి చేసి మినరల్స్‌ ఉన్న నీటిని అందిస్తుంది. రాత్రి రాగి పాత్రలో ఉంచిన నీటిని ఉదయం లేచిన వెంటనే తాగితే మంచి ప్రయోజనాలుంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని