ap news: కొత్తగా 10,373 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 88,441 మంది నమూనాలు పరీక్షించగా 10,373 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే కరోనాతో 80 మంది మృతి చెందినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో

Updated : 05 Jun 2021 17:40 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 88,441 మంది నమూనాలు పరీక్షించగా 10,373 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే కరోనాతో 80 మంది మృతి చెందినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 11,376కి చేరింది. గడచిన 24 గంటల్లో 15,958 మంది కొవిడ్‌ బారి నుంచి పూర్తిగా కోలుకున్నారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,28,108 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతోందని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. రాష్ట్రంలో కోటి 6లక్షల మందికి రెండు డోసుల వ్యాక్సిన్‌ పూర్తయిందని వెల్లడించారు. 45 ఏళ్లు దాటిన వారిలో 50శాతం మందికి ఒక డోసు పూర్తి చేశామని వివరించారు. వివిధ ఆసుపత్రుల్లో 406 టన్నుల ఆక్సిజన్‌ వినియోగిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటి వరకు 1,460 మ్యూకర్‌ మైకోసిస్‌ కేసులు నమోదయ్యాయని ఏకే సింఘాల్‌ తెలిపారు. 11వ విడత ఫీవర్‌ సర్వే పూర్తయిందని, కాల్‌ సెంటర్‌కు వచ్చే ఫోన్లు కూడా క్రమంగా తగ్గుతున్నాయన్నారు.

జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని