IMD: అరేబియా సముద్రంలో ‘బిపర్‌ జోయ్’ తుపాను: ఐఎండీ

అరేబియా సముద్రంలో ‘బిపర్‌ జోయ్‌’ తుపాను ఏర్పడినట్టు భారత వాతావరణ విభాగం తెలిపింది.

Published : 06 Jun 2023 21:55 IST

అమరావతి: అరేబియా సముద్రంలో ‘బిపర్‌ జోయ్‌’ తుపాను ఏర్పడినట్టు భారత వాతావరణ విభాగం తెలిపింది. ఆగ్నేయ అరేబియా సముద్రంలో గోవాకు నైరుతిగా 950 కి.మీ దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉన్నట్టు వెల్లడించింది. ముంబయికి 1050 కి.మీ దూరంలో తుపాను కొనసాగుతోంది. ఇది గంటకు నాలుగు కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతోందని పేర్కొంది. రాగల 24గంటల్లో ఇది మరింత బలపడి తీవ్ర తుపానుగా మారుతుందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు అరేబియా సముద్రంలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉన్నట్టు పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని