Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (05-10-2022)

ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (05/10/22)

Published : 05 Oct 2022 02:48 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

చేపట్టే పనిలో పట్టుదల చాలా అవసరం. కష్టం పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. ఆర్థికంగా శుభఫలితాలున్నాయి. హనుమాన్ చాలీసా పఠిస్తే మంచిది.

కీలక బాధ్యతలు మీ భుజాన పడతాయి. వాటిని సమర్ధంగా నిర్వహించి అందరి ప్రశంసలూ పొందుతారు. విందూ, వినోద, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవారాదన మానవద్దు. శని శ్లోకం చదవండి.

మధ్యమ ఫలితాలున్నాయి. కొన్ని విషయాలలో మీరు అనుకున్నదానికంటే ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. మనోవిచారం కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. మనోబలం తగ్గకుండా చూచుకోవాలి. సూర్యుణ్ణి ఆరాధిస్తే మంచిది.

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో శ్రమకు తగ్గఫలితం ఉంటుంది. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి.ఒక సంఘటన లేదా వార్త కాస్త బాధ కలిగిస్తుంది. శివారాధన శుభప్రదం

ఒక శుభవార్త వింటారు. ఉద్యోగులకు స్వస్థానప్రాప్తి సూచనలు ఉన్నాయి. బుద్ధిబలం బాగుండటం వలన కీలక సమయాలలో సమయోచితంగా స్పందించి అధికారుల మెప్పును పొందుతారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి. అన్నదానం చేయడం వలన మంచి ఫలితాలు పొందుతారు.

కుటుంబ సభ్యుల సంపూర్ణ సహకారం లభిస్తుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కొన్ని సంఘటనలు మీ మనోధైర్యాన్ని పెంచుతాయి. శని ధ్యాన శ్లోకం చదువుకోవాలి.

మధ్యమ ఫలితాలున్నాయి. తలపెట్టిన కార్యాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కొందరి ప్రవర్తన కాస్త బాధ కలిగిస్తుంది. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వస్తాయి. కోపాన్ని కాస్త తగ్గించుకుంటే మంచిది. గోసేవ చేస్తే బాగుంటుంది.  

గొప్ప శుభ సమయం. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేహసౌఖ్యం, సౌభాగ్యసిద్ధి ఉన్నాయి. చేపట్టిన పనులలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఆదిత్య హృదయ పారాయణ చేస్తే బాగుంటుంది.

శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. కనకధార స్తోత్రం పఠించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.

బుద్ధిబలం బాగుంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. పెద్దలతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. శుభవార్తలు వింటారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్ట దైవ సందర్శనం శుభప్రదం.

చేపట్టే పనిలో పట్టుదల చాలా అవసరం. కష్టం పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. ఆర్థికంగా శుభఫలితాలున్నాయి. హనుమాన్ చాలీసా పఠిస్తే మంచిది.

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. విందు, వినోద, ఆద్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. దైవారాధన మానవద్దు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts