Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (17-06-2022)

ఈ రోజు ఎవరి రాశి ఫలం ఎలా ఉందంటే?

Updated : 17 Jun 2022 04:29 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులను పూర్తిచేస్తారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.
 

మధ్యమ ఫలాలు ఉన్నాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి సాయం చేయడానికి కొందరు ముందుకు వస్తారు. విరోధులను తక్కువగా అంచనా వేయవద్దు. హనుమాన్ చాలీసా చదవాలి.
 

శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఒక వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. అవసరానికి తగిన సహాయం అందుతుంది. కలహ సూచన ఉంది. ఆదిత్య హృదయం చదవాలి.

మానసికంగా దృఢంగా ఉంటారు. అభివృద్ది కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం ఉంది. కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలు ఉంటాయి. ఇష్టదైవ ప్రార్ధన శుభప్రదం.

ఆశించిన ఫలితాలు ఉన్నాయి. ఒక వ్యవహారంలో సహాయం అందుతుంది. ఒక శుభవార్త మీ మనోవిశ్వాసాన్ని పెంచుతుంది. దైవబలం ఉంది. ఇష్టదైవారాధన శుభప్రదం.

మీ మీ రంగాల్లో ఓర్పు,పట్టుదల చాలా అవసరం. బంధువులతో వాదనలకు దిగడం వల్ల విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అవసరానికి మించిన ఖర్చులు ఉంటాయి. నవగ్రహ ఆలయ సందర్శనం శుభప్రదం.

చేపట్టే పనిలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. బంధువుల సహకారం ఉంటుంది. కీలక వ్యవహారాల్లో ముందుచూపు అవసరం. హనుమాన్ చాలీసా చదవడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు.

ధర్మసిద్ధి ఉంది. లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయి. ముఖ్య వ్యవహారాల్లో స్థిరబుద్ధితో ముందుకు సాగాలి. గోసేవ మంచి ఫలితాలను ఇస్తుంది.

మనోధైర్యంతో ముందుకు సాగి పనులను పూర్తిచేస్తారు. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ప్రయాణాల్లో అజాగ్రత్త వద్దు. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం ఉత్తమం.

 

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో మంచి ఫలితాలు ఉంటాయి. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరు. ఆర్ధికంగా దైవారాధన మానవద్దు.

పట్టుదలతో పనులను పూర్తిచేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. గోవిందనామాలు చదవడం వల్ల ఆపదలు తొలగుతాయి.

మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. కీలక విషయాల్లో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. ఇష్టదైవారాధన శుభప్రదం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని