Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (17-11-2021)

Today Horoscope: 12 రాశులవారి రాశి ఫలం వివరాలు...

Published : 17 Nov 2021 04:05 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు  ఎదురవుతాయి. తోటివారి సహకారం ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల తరవాత ఇబ్బందులు పడతారు. సుబ్రహ్మణ్య భుజంగ స్తవం పఠిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి.

ప్రయత్న కార్యసిద్ది ఉంది. ఒక ముఖ్య వ్యవహారంలో పెద్దల సాయం అందుతుంది. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. మనోబలాన్ని తగ్గించే సంఘటనలకు దూరంగా ఉండాలి. ఇష్టదేవతా స్తోత్రం చదివితే బాగుంటుంది.

ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అనవసర వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉండటం మేలు. శివనామస్మరణ శుభాన్ని ఇస్తుంది.

శుభకాలం. మంచి పనులు చేపడతారు. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయి. మీ బుద్ధిబలంతో  కీలక సమస్యను పరిష్కరిస్తారు. శ్రీమహాగణపతి ఆరాధన చేస్తే మంచిది.  

పట్టుదలతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. అనవసర ఖర్చులు సూచితం. శ్రమ అధికం అవుతుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. దుర్గా అష్టోత్తరం చదివితే మంచిది.    

ప్రారంభించిన పనిలో కార్యసిద్ధి ఉంది. చక్కటి ఆలోచనా విధానంతో ముందుకు సాగి మంచిపేరు సంపాదిస్తారు. అష్టమ చంద్ర సంచారం అనుకూలంగా లేదు. చంద్రధ్యానం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.  

సమయానుకూలంగా ముందుకు సాగండి. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. సమయానికి నిద్రాహారాలు తీసుకోవాలి. దుర్గాఅష్టోత్తర శతనామావళి చదవాలి.

ఒక ముఖ్య వ్యవహారంలో కుటుంబ సభ్యుల సంపూర్ణ సహకారం లభిస్తుంది. అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది. సూర్యాష్టకం చదివితే బాగుంటుంది.

ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఒక ముఖ్య వ్యవహారంలో ఆర్థికసాయం అందుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు చేయగలుగుతారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. దుర్గారాధన శుభప్రదం.

 

ప్రారంభించబోయే పనులకు ఆటంకాలు కలుగకుండా వ్యవహరించాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. శరీర సౌఖ్యం కలదు. సూర్యాష్టకం పఠిస్తే శుభఫలితాలు కలుగుతాయి.

అవసరానికి తగిన సహాయం చేసేవారు ఉన్నారు. తోటివారి సహకారంతో ఆపదలు తొలగుతాయి. మనోవిచారాన్ని కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. శివారాధన మంచిది.

లక్ష్యాలను సాధించే క్రమంలో ఒత్తిడిని జయించాలి. ముఖ్య విషయాల్లో ముందుగానే స్పందించండి. క్షమాగుణంతో ఉంటే మేలు జరుగుతుంది. దైవబలం రక్షిస్తోంది. గణపతి సహస్ర నామ పారాయణ వల్ల మంచి జరుగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని