
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (19-01-2022)
- డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్
మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. ముఖ్య కార్యక్రమాల్లో అప్రమత్తంగా ఉండాలి. హనుమాన్ చాలీసా చదవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.
ఆశించిన ఫలితాలు రావడానికి కాస్త ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తడబడతారు. ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. నవగ్రహ ధ్యాన శ్లోకాన్ని చదివితే అన్ని విధాలా మంచిది.
చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.
ప్రారంభించిన పనులలో చిన్నపాటి సమస్యలు ఎదురైనా పూర్తి చేయగలుగుతారు. అలసట పెరుగుతుంది. మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. ఇష్టదేవతా నామస్మరణ ఉత్తమం.
మనోధైర్యంతో ప్రయత్నించి పనులను సాధిస్తారు. ఉత్సాహం తగ్గకుండా పనిచేయాలి. బంధుమిత్రులను కలుస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. చంద్రశేఖరాష్టకం చదివితే మంచిది.
మంచి సమయం. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.
శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. పనులను విషయాలను సాగదీయకండి, త్వరగా పూర్తయ్యేలా ప్రణాళికను సిద్ధం చేయండి. ఆదిత్య హృదయం చదవడం మంచిది.
మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఒక సమస్య మానసిక ప్రశాంతతను తగ్గిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మంచిది.
వృత్తి,ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. మీ చుట్టూ సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం కలదు. దైవబలం విశేషంగా ఉంది. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం ఉత్తమం.
కీలక వ్యవహారాలలో అధికారుల ప్రశంసలు లభిస్తాయి. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది.
ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. సంకటహర గణపతి స్తోత్రం చదవడం మంచిది.
శుభకాలం. కొన్ని వ్యవహారాలలో స్థిరమైన బుద్ధితో వ్యవహరించి మంచి ఫలితాలను అందుకుంటారు. వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. సకాలంలో సహాయం చేసేవారు ఉన్నారు. శివారాధన చేయడం మంచిది.