horoscope today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (19-03-2022)

ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (19/03/2022)

Updated : 19 Mar 2022 03:22 IST

-డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్


మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక ముఖ్య విషయమై అధికారులను కలుస్తారు. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. ఆదాయానికి తగ్గ వ్యయం ఉంది. బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. లక్ష్మీదర్శనం ఉత్తమం.   


మిశ్రమ కాలం. కీలక వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయాలి. అధికారులు మీ పనితీరుతో సంతృప్తిపడకపోవచ్చు. అస్థిర నిర్ణయాలతో సతమతమవుతారు. కలహాలకు దూరంగా ఉండాలి. నవగ్రహ శ్లోకాలు చదవాలి.


ప్రారంభించిన పనులలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. బుద్దిబలంతో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబ అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. ఇష్టదైవారాధన శ్రేయస్సును ఇస్తుంది.


మీ మీ రంగాల్లో పనులలో ఊహించిన ఫలితాలు వెలువడతాయి. కలహాలకు దూరంగా ఉండాలి. ఒక వ్యవహారంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఆదిత్యహృదయం పారాయణ చేస్తే  బాగుంటుంది.


అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. ఇష్టదైవ దర్శనం ఉత్తమం. 


శుభసమయం. మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలను రాబడతారు. అదృష్టం వరిస్తుంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబసభ్యులతో ఆనందకర క్షణాలను గడుపుతారు.


ముఖ్య విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. శివారాధన మంచిది.


శుభకాలం. చిత్తశుద్ధితో విజయం సాధిస్తారు. స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. శివారాధన వల్ల మంచి జరుగుతుంది.


.

ప్రారంభించిన పనులను సులభంగా పూర్తిచేస్తారు. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఒక వార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. లక్ష్మీదేవి దర్శనం ఉత్తమం.


 

పట్టుదల చాలా అవసరం. ఒత్తిడి తగ్గించుకోవాలి. బంధు,మిత్రులను కలుపుకొనిపోతారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని ఇస్తాయి. పెద్దల ఆశీర్వచనాలు ఉన్నాయి. ఈశ్వర ఆరాధన శుభప్రదం.


 మిశ్రమ కాలం. మీ మీ రంగాల్లో శారీరక శ్రమ పెరుగుతుంది. గిట్టనివారితో మిత భాషణం అవసరం. స్థాన చలనం సూచితం. అప్పుల వల్ల ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. శ్రీఆంజనేయస్వామి ఆరాధన శుభదాయకం.


ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయగలుగుతారు. శ్రమ ఫలిస్తుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అనవసర ధనవ్యయం. ఇష్టదైవారాధన మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని