Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (23-10-2021)

Today Horoscope: 12 రాశులవారి రాశి ఫలం వివరాలు...

Published : 23 Oct 2021 04:56 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

ప్రారంభించబోయే పనులలో చంచల స్వభావం రానీయకండి. ఆటంకాలు పెరగకుండా చూసుకోవాలి. పనిలో ఒత్తిడి పెరుగుతుంది. బంధు,మిత్రులతో అతిచనువు వద్దు. దుర్గాదేవిని పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయి.

శుభసమయం. బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరించి అందరి దృష్టినీ ఆకర్షిస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ దైవారాధన  మానవద్దు.

మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీకు అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. కొన్ని కీలక పనులను పూర్తిచేయగలుగుతారు. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. ఉమామహేశ్వరస్తోత్రం పఠిస్తే మంచిది.

ప్రయత్న కార్యానుకూలత ఉంది. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది. గతంలో ఆగిన పనులు మళ్లీ ప్రారంభం అవుతాయి.  కుటుంబ సహకారం ఉంటుంది. ఇష్టదైవారాధన శుభప్రదం.

మంచి కాలం. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్పూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. కృష్ణాష్టకం పఠిస్తే బాగుంటుంది.

ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ముఖ్య వ్యవహారంలో పెద్దలను కలుస్తారు. నిర్ణయం మీకు అనుకూలంగా రాకపోవచ్చు. బంధు,మిత్రులను కలుస్తారు. దత్తాత్రేయ స్తోత్రం చదివితే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.

మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఒక విషయంలో ధైర్యంతో ముందడుగు వేసి  కీర్తిని గడిస్తారు. కుటుంబ విషయాల్లో ఓర్పు అవసరం. శ్రీ విష్ణు ఆరాధన మంచిది. సూర్య ఆరాధన వల్ల మంచి జరుగుతుంది.  

మంచి కాలం. ప్రారంభించిన పనులను సజావుగా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ ప్రతిభకు పెద్దలు లేదా అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.  ప్రయాణాలు లాభిస్తాయి. శివ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది.

శుభకాలం. మీ మీ రంగాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. బంధువులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు. ఇష్టదైవాన్ని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

 

ఎంత శ్రమిస్తే అంత ఫలితం ఉంటుంది. పెద్దల నుంచి ప్రోత్సాహకాలను అందుకుంటారు. అలసట కాస్త ఎక్కువగా ఉంటుంది. తోటివారి సహకారంతో పనులు త్వరగా పూర్తవుతాయి. నవగ్రహాలను  ఆరాధించడం వల్ల శుభ ఫలితాలను పొందగలుగుతారు.

మిశ్రమకాలం. లక్ష్యాలకు కట్టుబడి పనిచేయాలి. ధర్మ సందేహాలతో కాలాన్ని వృథా చేయకండి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. మనో విచారం కలగకుండా చూసుకోవాలి. ప్రయాణంలో ఆటంకాలు కలుగుతాయి. శివారాధన శుభప్రదం.

ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. విందూ,వినోద,ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవారాధన మానవద్దు. శివారాధన శుభప్రదం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని