Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (10/06/23)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించే నేటి రాశి ఫలాల వివరాలు.
- డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్
అదృష్టం వరిస్తుంది. ప్రారంభించిన పనులు శీఘ్ర విజయాన్ని చేకూరుస్తాయి. బాధ్యతలను సమర్ధంగా నిర్వర్తిస్తారు. అర్థలాభం ఉంది. వ్యాపారంలో ఆర్ధికంగా ఎదుగుతారు. శ్రీఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం.
ప్రారంభించిన పనులు పనులు క్రమంగా పూర్తవుతాయి. స్థిరాస్తి కొనుగోలు విషయాలు లాభిస్తాయి. స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. సూర్యాష్టకం చదివితే శుభఫలితాలు కలుగుతాయి.
చేపట్టే పనిలో ఆటంకాలు ఉన్నాయి. చంచలబుద్ధి వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. అనవసర విషయాల గురించి సమయాన్ని వృథా చేయకండి. ఈశ్వర సందర్శనం శుభప్రదం.
సందర్భానుసారంగా ముందుకు సాగండి. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ధనలాభం సూచితం. మానసిక ప్రశాంతత కోసం లక్ష్మీ సందర్శనం ఉత్తమం.
మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అలసట పెరుగుతుంది. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దల సలహాలు మేలు చేస్తాయి. ఎప్పటినుంచో మీరు చేయాలనుకుంటున్న ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తిచేస్తారు. మహాలక్ష్మి అష్టోత్తరం చదవడం వల్ల మంచి జరుగుతుంది.
శుభకాలం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సొంతింటి వ్యవహారంలో ముందడుగు పడుతుంది. బంధు,మిత్రులను కలుస్తారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఇష్టదైవారాధన శుభప్రదం.
మిశ్రమ కాలం. కీలక వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయాలి. మీ పనితీరుతో అధికారులు సంతృప్తి పడక పోవచ్చు. అస్థిరనిర్ణయాలతో సతమతం అవుతారు. కలహాలకు దూరంగా ఉండాలి. విష్ణు ఆరాధన శుభప్రదం.
ఒక వ్యవహారంలో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో విబేధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఇష్టదైవ సందర్శనం మేలు చేస్తుంది.
మంచి కాలం. ఏ పని ప్రారంభించినా సులువుగా పూర్తవుతుంది. నలుగురిలో మంచిపేరు సంపాదిస్తారు. కుటుంబ సౌఖ్యం కలదు. ఇష్టదైవ ప్రార్థన మరింత మేలు చేస్తుంది.
ప్రారంభించిన పనుల్లో ఆశించిన ఫలితాలను రాబట్టడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగించకుండా చూసుకోవాలి. భోజన నియమాలను పాటించడం ఉత్తమం. శ్రీవారి దర్శనం శుభకరం.
బలమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. బుద్ధిబలంతో ఆపదల నుంచి బయటపడతారు. మీ శ్రమ వృథా కాదు. మిత్రుల సహకారం ఉంటుంది. ఆర్థికయోగం శుభప్రదం. సూర్య ఆరాధన శుభదాయకం.
కొద్దిపాటి సమస్యలు ఉన్నప్పటికీ అనుకున్న పనులను సకాలంలో పూర్తిచేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. బంధువులతో మాటపట్టింపులకు పోవద్దు. శని శ్లోకం చదవాలి.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
వివేక్ రామస్వామితో డిన్నర్ అవకాశం
-
చంద్రునిపై ల్యాండర్, రోవర్ నుంచి అందని సంకేతాలు
-
పండగ సీజనులో కొనుగోళ్ల జోరు!
-
సంక్రాంతికి గ్రహాంతర విందు
-
Amazon Prime Video: అమెజాన్ ప్రైమ్ చందాదారులా? అయితే, ఈ విషయం తెలుసా?
-
Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ప్రభాస్‌తో పాటు ఆ స్టార్ హీరోయిన్!