Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/05/2023)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించే నేటి రాశి ఫలాల వివరాలు.
- డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్
ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. చేపట్టే పనిలో బద్ధకాన్ని వీడాలి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధు,మిత్రులతో విబేధాలు రావచ్చు. ఇష్టదేవతా స్తోత్రం చదివితే బాగుంటుంది.
ప్రారంభించిన పనులు చకచకా పూర్తవుతాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ ప్రతిభను పెద్దలు మెచ్చుకుంటారు. అవసరాలకు ధనం చేకూరుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆదిత్య హృదయ పారాయణ శుభప్రదం.
శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఒక వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి డబ్బు సమకూరుతుంది.ఆదిత్య హృదయం చదవాలి.
అనుకూలమైన సమయం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీరు ఆశించే నిర్ణయాలు వస్తాయి. ప్రారంభించబోయే పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది.
శ్రద్ధగా పనిచేసి మంచి ఫలితాలను అందుకుంటారు. ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. దగ్గరివారితో విబేధాలు రాకుండా చూసుకోవాలి. శారీరక శ్రమ పెరుగుతుంది. నవగ్రహ శ్లోకం చదవాలి.
మంచి పనులు చేపడతారు. గొప్పవారితో సత్సాంగత్యం ఏర్పడుతుంది. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి.ఆంజనేయ ఆరాధన శుభప్రదం.
అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది. వృత్తి,ఉద్యోగ, వ్యాపారాలలో మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వ్యాపార లాభాలు ఉన్నాయి. సమయపాలనతో పనులను పూర్తిచేస్తారు. శ్రీలక్ష్మీదేవి ఆలయ సందర్శనం శుభప్రదం.
చేపట్టిన పనులలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వడం మంచిది. మనఃస్సౌఖ్యం ఉంది. నవగ్రహ ధ్యానం శుభప్రదం.
మనఃస్సౌఖ్యం ఉంది. ముఖ్య విషయాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి. సాహసోపేతమైన నిర్ణయాలు అనుకూలిస్తాయి. అనవసర విషయాల గురించి కాలాన్ని వృథా చేయకండి. మనశ్శాంతి లోపించకుండా జాగ్రత్తపడండి. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.
శుభకాలం ఉంది. ప్రారంభించిన పనులను సులువుగా పూర్తిచేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అభివృద్ధికి సంబందించిన శుభవార్తలు వింటారు. ఒత్తిడిని దరిచేరనీయకండి. ఆదిత్య హృదయం చదవడం శుభకరం.
శుభకాలం. కొన్ని కీలక నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం మీకు లభిస్తుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తిచేయగలుగుతారు.ఇష్ట దైవాన్ని స్మరించండి.
స్థిరనిర్ణయాలు మేలు చేస్తాయి. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రారంభించిన పనులలో శుభఫలితాలను సాధిస్తారు. మీ ప్రతిభ, పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. గోవింద నామాలు చదివితే బాగుంటుంది.
- ఇంటర్నెట్ డెస్క్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Avinash Reddy: వివేకా హత్యకేసులో 8వ నిందితుడిగా అవినాష్‌రెడ్డి: సీబీఐ
-
Movies News
ott movies: ఈ వారం ఓటీటీలో 17 సినిమాలు/వెబ్‌సిరీస్‌లు
-
India News
Air India: విమానం రష్యాకు మళ్లించిన ఘటన.. ప్రయాణికులకు ఎయిరిండియా ఆఫర్
-
Politics News
Nara Lokesh: జగన్ పులివెందులకు ఏం చేశారు?: నారా లోకేశ్
-
Sports News
WTC Final: అదేం ఫీల్డింగ్.. రోహిత్ కెప్టెన్సీపై దాదా విసుర్లు!
-
Movies News
Adipurush: ‘ఆదిపురుష్’ సెన్సార్ రిపోర్ట్.. రన్‌టైమ్ ఎంతంటే?