Dastagiri: నా భర్తకు బెయిల్‌ రాకుండా ఇబ్బంది పెడుతున్నారు: దస్తగిరి భార్య

మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో (Viveka Murder Case) అప్రూవర్‌గా మారిన తన భర్త దస్తగిరికి బెయిల్‌ రాకుండా పోలీసులు, వైకాపా నేతలు ఇబ్బంది పెడుతున్నారని ఆయన భార్య షబానా ఆరోపించారు.

Published : 18 Dec 2023 17:52 IST

కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో (Viveka Murder Case) అప్రూవర్‌గా మారిన తన భర్త దస్తగిరికి బెయిల్‌ రాకుండా పోలీసులు, వైకాపా నేతలు ఇబ్బంది పెడుతున్నారని ఆయన భార్య షబానా ఆరోపించారు. కడప జిల్లా జైలులో ఉన్న దస్తగిరిని సోమవారం ఆమె కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 50 రోజులుగా తన భర్త కడప జైలులోనే మగ్గుతున్నారని, అప్రూవర్‌గా మారిన తర్వాత ఇబ్బందులు పెరిగాయన్నారు. ‘‘వివేకా కేసులో రాజీకి రావాలని వైకాపా పెద్దలు చెప్పారు. వారి ప్రయత్నాలు కుదరకే నా భర్తను ఇబ్బంది పెడుతున్నారు. మా కుటుంబానికి ఏం జరిగినా వైకాపా నేతలు, ప్రభుత్వానిదే బాధ్యత’’ అని షబానా అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని