logo

వైకాపా మ్యానిఫెస్టో తుస్సుమంది: గంటా

జగన్‌ మోహన్‌రెడ్డి ప్రకటించిన మ్యానిఫెస్టో తుస్సుమందని తెదేపా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. కొత్తవి లేక పోగా ఉన్న పథకాలను అమలు చేస్తామని మ్యానిఫెస్టోలో చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

Published : 28 Apr 2024 05:45 IST

ఆరోవార్డు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న గంటా శ్రీనివాసరావు

కొమ్మాది, న్యూస్‌టుడే: జగన్‌ మోహన్‌రెడ్డి ప్రకటించిన మ్యానిఫెస్టో తుస్సుమందని తెదేపా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. కొత్తవి లేక పోగా ఉన్న పథకాలను అమలు చేస్తామని మ్యానిఫెస్టోలో చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జీవీఎంసీ ఆరోవార్డులో గంటా శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎండను సైతం లెక్క చేయకుండా మహిళలు, యువత రోడ్లపైకి వచ్చి ఆయనకు స్వాగతం పలికారు. ముందుగా కొమ్మాది కూడలిలోని మూడుగుళ్ల వద్ద గంటా శ్రీనివాసరావు ఆయన తనయుడితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రవితేజ ఆలయ ప్రాంగణంలో మహిళలతో కలిసి కోలాటం ఆడుతూ నృత్యం చేశారు. అనంతరం రిక్షాకాలనీ, హెచ్‌బీకాలనీ, కొమ్మాది, అమరావతినగర్‌, కె-1, కె-2 కాలనీలు, అన్నంరాజు నగర్‌ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేపట్టారు. గతంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు భీమిలి నియోజకవర్గంలో రూ.3,800 కోట్లతో పలు అభివృద్ధి పనులు నిర్వహించానన్నారు. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి సంక్షేమం అందిస్తున్నామని జగన్‌తో పాటు ఆ పార్టీ నేతలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అభివృద్ధి, సంక్షేమం తెదేపాకు రెండు కళ్లని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెదేపా, జనసేన, భాజపా నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని