కొవాగ్జిన్‌కు డీసీజీఐ లైసెన్సింగ్‌ అనుమతి

నగరానికి చెందిన ఔషధ దిగ్గజ సంస్థ భారత్‌ బయోటెక్‌కు ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) లైసెన్సింగ్‌ అనుమతి మంజూరు చేసింది. కొవాగ్జిన్‌ టీకా తయారీ కోసం భారత్‌ బయోటెక్‌కు ఈ లైసెన్సింగ్‌ అనుమతిని డీసీజీఐ జారీ చేసింది. కొవాగ్జిన్‌ అత్యవసర వినియోగానికి డీసీజీఐ ఆమోదం తెలపడం పట్ల భారత్‌ బయోటెక్‌ సంస్థ ఎండీ కృష్ణ

Published : 04 Jan 2021 01:18 IST

దేశం గర్వించదగ్గ విషయం: భారత్‌ బయోటెక్‌ ఎండీ కృష్ణ ఎల్ల

హైదరాబాద్‌: నగరానికి చెందిన దిగ్గజ ఔషధ సంస్థ భారత్‌ బయోటెక్‌కు ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) లైసెన్సింగ్‌ అనుమతి మంజూరు చేసింది. కొవాగ్జిన్‌ టీకా తయారీ కోసం భారత్‌ బయోటెక్‌కు ఈ లైసెన్సింగ్‌ అనుమతిని డీసీజీఐ జారీ చేసింది. కొవాగ్జిన్‌ అత్యవసర వినియోగానికి డీసీజీఐ ఆమోదం తెలపడం పట్ల భారత్‌ బయోటెక్‌ ఎండీ కృష్ణ ఎల్ల హర్షం వ్యక్తం చేశారు. డీసీజీఐ అనుమతివ్వడం.. దేశం గర్వించదగ్గ విషయమన్నారు. భారత శాస్త్రీయ సామర్థ్యానికి ఈ అనుమతి తార్కాణమని అభివర్ణించారు. దేశ పర్యావరణహిత ఆవిష్కరణల పథంలో ఇదో మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. వివిధ రకాల వైరల్‌ ప్రొటీన్లను తట్టుకునేలా కొవాగ్జిన్‌ రూపొందించినట్లు కృష్ణ ఎల్ల చెప్పారు. కొవాగ్జిన్‌ బలమైన రోగనిరోధక ప్రతిస్పందనలను ఉత్పత్తి చేస్తుందన్నారు. డీసీజీఐ అనుమతి కొత్త ఉత్పత్తుల అభివృద్ధికి ఊతమిచ్చేలా ఉందని కృష్ణ ఎల్ల సంతోషం వ్యక్తం చేశారు.

కొవిడ్‌-19 నిర్మూలనకు భారత్‌ బయోటెక్‌ రూపొందించిన స్వదేశీ టీకా కొవాగ్జిన్‌కు నిపుణుల కమిటీ శనివారం పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే. అనంతరం కొవాగ్జిన్‌కు షరతులతో కూడిన అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని డీసీజీఐకు నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న డీసీజీఐ.. తాజాగా కొవాగ్జిన్‌ తయారీకి లైసెన్సింగ్‌ అనుమతి జారీ చేసింది.

ఇవీ చదవండి..
అన్ని దేశాలకు అందించడమే లక్ష్యం: సుచిత్ర ఎల్ల

‘కోవిన్’ యాప్‌‌ ద్వారానే టీకా పంపిణీ..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని