South Central Railway: విష్ణుపురం వద్ద ట్రాక్‌ పనులు పూర్తి.. యధావిధిగా రైళ్ల రాకపోకలు

దక్షిణ మధ్య రైల్వే అధికారులు కొన్ని రైళ్లను దారిమళ్లించారు. మరికొన్ని రైళ్ల టైం షెడ్యూల్‌ను మార్చారు. 

Updated : 26 May 2024 20:28 IST

హైదరాబాద్‌: నల్గొండ జిల్లా దామరచర్ల మండలం విష్ణుపురం వద్ద గూడ్స్‌ రైలు పట్టాలు తప్పడంతో సికింద్రాబాద్‌-గుంటూరు మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు కొన్ని రైళ్లను దారిమళ్లించారు. మరికొన్ని రైళ్ల టైం షెడ్యూల్‌ను మార్చారు. సికింద్రాబాద్-హౌరా ఫలక్ నుమా ఎక్స్‌ప్రెస్‌, సికింద్రాబాద్‌- భువనేశ్వర్‌ వెళ్లే విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల షెడ్యూల్‌లో మార్పులు చేశారు. ఈ రైళ్లు పగిడిపల్లి-కాజిపేట-వరంగల్-కొండపల్లి-మీదుగా విజయవాడ చేరుకుంటాయి. విజయవాడ - లింగంపల్లి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ గంట ఆలస్యంగా బయలుదేరనుంది. మిర్యాలగూడలో శబరి ఎక్స్‌ప్రెస్‌, పిడుగురాళ్లలో జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ 4 గంటలకుపైగా నిలిచిపోయాయి. గుంటూరు నుంచి వచ్చిన రైల్వే అధికారులు ట్రాక్‌ మరమ్మతు పనులు పూర్తి చేయడంతో ఆదివారం రాత్రి నుంచి రైళ్ల రాకపోకలు యధావిధిగా కొనసాగుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని