బరువు తగ్గడానికి నోటిని మూసే పరికరం..!

ఆధునిక జీవవశైలి, ఆహారపు అలవాట్లో చాలా మంది ఉబకాయులుగా మారిపోతున్నారు. జంక్‌ఫుడ్‌ వల్ల కొవ్వు పెరిగి లావు అవుతాం.. ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినా.. నియంత్రించుకోలేక తినేస్తుంటారు. తర్వాత లావెక్కామని బాధపడుతుంటారు. అలాంటి వారి కోసం న్యూజిలాండ్‌లోని

Published : 30 Jun 2021 01:07 IST

విమర్శలపాలవుతున్న ఆవిష్కరణ

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆధునిక జీవవశైలి, ఆహారపు అలవాట్లతో చాలా మంది ఊబకాయులుగా మారిపోతున్నారు. జంక్‌ఫుడ్‌ వల్ల కొవ్వు పెరిగి లావు అవుతాం.. ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినా.. నియంత్రించుకోలేక తినేస్తుంటారు. తర్వాత లావెక్కామని బాధపడుతుంటారు. అలాంటి వారి కోసం న్యూజిలాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ ఓటాగో ఓ వింత పరికరాన్ని రూపొందించింది. అయితే, ఈ పరికరంపై నెటిజన్ల నుంచి ప్రతికూల స్పందన వస్తోంది.

డెంటల్‌ స్లిమ్‌ పేరుతో తయారు చేసిన ఈ పరికరంలో రెండు అయస్కాంతపు ముక్కలు ఉంటాయి. వాటిని పైదవడలోని ఒక పంటికి.. కింది దవడలోని ఒక పంటికి అమర్చుకోవాలి. డివైజ్‌ను యాక్టివేట్‌ చేయగానే.. నోరు ఆటోమెటిక్‌గా మూసుకుపోతుంది. డివైజ్‌ను డియాక్టివేట్‌ చేస్తే తప్ప తిరిగి నోరు తెరుచుకోదు. ఈ డివైజ్‌ పనిచేస్తున్నంత కాలం నోరు తెరుచుకోదు కాబట్టి.. ఆహారాన్ని ద్రవరూపంలోనే తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో బరువు పెరగడం ఆగడమే కాదు.. శరీరం సన్నబడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఈ పరికరాన్ని ఏడుగురు మహిళలపై వారం రోజులపాటు ప్రయోగించారు. ఆ పరికరాన్ని మహిళలకు అమర్చగానే నోరు మూసుకుపోయింది. దీంతో వారం పాటు వారంతా కేవలం ద్రవరూపంలోనే ఆహారాన్ని తీసుకున్నారు. వారం రోజుల తర్వాత పరిశీలిస్తే మంచి ఫలితాలు వచ్చాయట. ఆ మహిళలు వారి మొత్తం బరువులో 5.1శాతం బరువు తగ్గారట. అయితే, ఈ పరికరం ఉపయోగిస్తున్నప్పుడు ఆ మహిళలకు అసౌకర్యంగా అనిపించింది. మాట్లాడానికి కూడా రాకపోవడం చాలా ఇబ్బందులు పడ్డారు. 

ఈ పరికరం రూపకల్పన గురించి యూనివర్సిటీ ఆఫ్‌ ఓటాగో సోషల్‌మీడియాలో వెల్లడించగా.. ఇంత కష్టతరమైన, ఆరోగ్యాన్ని పాడుచేసే ఈ పరికరం రూపొందించడమేంటని నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, ఇది కేవలం బరువు తగ్గడానికి అన్ని విధాలుగా ప్రయత్నించి విఫలమైన వారికి మాత్రమే ఉపయోగకరంగా ఉంటుందని వర్సిటీ అధికారులు సమర్థించుకునే ప్రయత్నం చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని