
TS Lockdown: చెక్‌పోస్టులను పరిశీలించిన డీజీపీ
హైదరాబాద్: కరోనా కట్టడికి లాక్డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో జాతీయ రహదారిపై చెక్‌పోస్టులను డీజీపీ మహేందర్‌రెడ్డి అకస్మాత్తుగా తనిఖీ చేశారు. విజయవాడ జాతీయ రహదారిపై ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, అంబర్‌పేట, కొత్తగూడెం వద్ద ఏర్పాటుచేసిన చెక్‌పోస్టులను రాచకొండ సీపీ మహేష్ భగవత్‌తో కలిసి పరిశీలించి సిబ్బంది పని తీరును తనిఖీ చేశారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ.. ప్రజల భాగస్వామ్యంతో తెలంగాణ వ్యాప్తంగా లాక్డౌన్ పటిష్టంగా అమలవుతోందన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది 24గంటలూ శ్రమిస్తూ కఠినంగా లాక్డౌన్ అమలుచేస్తున్నారని అభినందించారు. రాష్ట్రంలో 99.9% ప్రజలు ప్రజలు లాక్‌డౌన్‌కు సహకరిస్తున్నారని చెప్పారు. ఎవరైనా లాక్డౌన్ నిబంధనల్ని అతిక్రమించి బయటకు వస్తే వాహనాలు జప్తు చేసుకుంటున్నట్టు తెలిపారు. ఆయా వాహనాలను లాక్డౌన్ తర్వాత కోర్టునుంచి తీసుకోవాలన్నారు. కాలనీలలో కూడా యువకులు, చిన్నారులు బయటకు వచ్చి క్రికెట్ ఆడవద్దని, వారికి కాలనీ అసోసియేషన్లు అవగాహన కల్పించాలని సూచించారు.