Updated : 23 Jun 2021 14:12 IST

Ts News: పిల్లల కోసం ప్రత్యేకంగా 6వేల పడకలు

హైకోర్టుకు నివేదిక సమర్పించిన డీహెచ్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సలు, పరీక్షలకు గరిష్ఠ ధరలపై జీవో జారీ చేశామని ప్రజారోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు హైకోర్టుకు నివేదించారు. 170 ప్రైవేటు ఆస్పత్రులపై 350 ఫిర్యాదులు వచ్చాయని.. 30 ఫిర్యాదులు పరిష్కరించి బాధితులకు రూ.72.20లక్షలు వెనక్కి ఇప్పించామని వివరించారు. మిగతా బాధితులకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని డీహెచ్‌ హైకోర్టుకు తెలిపారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా శ్రీనివాసరావు నివేదిక సమర్పించారు. రాష్ట్రంలో రోజుకు సరాసరి 1.17లక్షల కరోనా పరీక్షలు జరుగుతున్నాయని, పాజిటివిటీ రేటు 1 శాతానికి తగ్గిందని డీహెచ్‌ తన నివేదికలో పేర్కొన్నారు.

‘‘రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చురుగ్గా కొనసాగుతోంది. 28.76లక్షల మందికి రెండు డోసులు, 68.48లక్షల మందికి ఒక డోసు పూర్తి చేశాం. రాష్ట్రంలో ఇంకా 1.94కోట్ల మందికి వ్యాక్సిన్‌ ఇవ్వాల్సి ఉంది. ఈనెల 29 నాటికి కేంద్రం నుంచి 10.76లక్షల డోసులు రావాల్సి ఉంది. హైరిస్కు గ్రూపుల్లో 23.11 లక్షల మందికి వ్యాక్సినేషన్‌ పూర్తి చేశాం. విదేశాలకు వెళ్లే 6,874 మంది విద్యార్థులకు వ్యా్క్సిన్లు ఇచ్చాం. మానసిక ఒత్తిడికి చికిత్స, కౌన్సెలింగ్‌ కోసం అన్ని ఆస్పత్రుల్లో ఏర్పాట్లు చేశాం. మూడో దశ కరోనాను ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని 27,141 పడకలకు గాను 10,224 పడకలకు ఆక్సిజన్‌ సదుపాయం కల్పించాం. మిగతా 16,914 పడకలకు ఆక్సిజన్‌ సదుపాయాల కోసం చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నాం. నీలోఫర్‌ సహా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పిల్లల కోసం ప్రత్యేకంగా 6వేల పడకలు సిద్ధం చేశాం. పిల్లల వైద్యులతో కమిటీ ఏర్పాటు చేసి సలహాలు తీసుకుంటున్నాం. పిల్లల చికిత్సలకు అవసరమైన ఔషధాలు సిద్ధంగా ఉంచాం’’ అని హైకోర్టుకు సమర్పించిన నివేదికలో డీహెచ్‌ శ్రీనివాసరావు వివరించారు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని