Medaram: ఇంటికే సమ్మక్క సారలమ్మ ప్రసాదం: ఇంద్రకరణ్‌రెడ్డి

దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద మేడారం జాతరకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

Updated : 11 Feb 2022 14:04 IST

హైదరాబాద్‌: దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద మేడారం జాతరకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. అయితే ఈ ఏడాది కొత్తగా మేడారం సమ్మక్క, సారలమ్మ ప్రసాదాన్ని డోర్‌ డెలీవరీ చేయనున్నట్లు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ, తపాలా, ఐటీ శాఖల సహకారంతో డోర్ డెలివరీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈనెల 12-22 వరకు ఆన్‌లైన్‌లో ఇంటికే ప్రసాదం సేవలను భక్తులు వినియోగించుకోవాలని కోరారు. ‘‘భక్తులు ఇంటి నుంచే బంగారం అమ్మవారికి పంపేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తుంది. ఆర్టీసీ సిబ్బంది ఇంటికి వచ్చి ప్రసాదం తీసుకెళ్తారు. బంగారం అమ్మవారికి సమర్పించి మళ్లీ తిరిగి అందజేస్తారు. దీనికోసం మీ సేవా లేదా టీయాప్‌ ఫోలియో ద్వారా ముందస్తుగా బుక్‌ చేసుకోవాలి’’అని మంత్రి సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని