
Drone Visuals: గోదారమ్మ జల సోయగం.. అబ్బురపరుస్తున్న డ్రోన్ దృశ్యాలు
ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న జోరు వానలు.. ఎగువ నుంచి వస్తున్న వరదతో గోదావరిలో జలకళ ఉట్టిపడుతోంది. కొత్త నీరుతో గోదారమ్మ పరవళ్లు తొక్కుతోంది. డ్రోన్ ద్వారా తీసిన దృశ్యాల్లో గోదారమ్మ జల సోయగం ఒలకబోస్తోంది. భద్రాచలం వద్ద ఆకాశం నుంచి గోదావరి దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి.
భద్రాచలం వద్ద శాంతించిన గోదారమ్మ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదారమ్మ శాంతించింది. నిన్న రాత్రి వరకు ఉగ్రరూపం దాల్చి ప్రవహించిన గోదావరి ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. నిన్న సాయంత్రానికి 48.6 అడుగులకు చేరడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన విషయం తెలిసిందే. అర్ధరాత్రి నుంచి గోదావరి ప్రవాహం క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆదివారం సాయంత్రానికి ఆరు అడుగులు తగ్గి 43 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను కూడా ఉపసంహరంచుకున్నారు.