Jagityal: మద్యం మత్తులో వ్యక్తి హల్‌చల్.. పోలీసులను ఐడీ కార్డు చూపాలని డిమాండ్‌!

జగిత్యాలలో.. మద్యం మత్తులో ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. కొత్త బస్టాండ్ సమీపంలోని నటరాజ్ టాకీస్ వద్ద ద్విచక్ర వాహనం

Published : 21 Dec 2021 18:08 IST

జగిత్యాల: జగిత్యాలలో.. మద్యం మత్తులో ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. కొత్త బస్టాండ్ సమీపంలోని నటరాజ్ టాకీస్ వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఓ వ్యక్తి కింద పడిపోయాడు. అక్కడే పెట్రోలింగ్ చేస్తున్న పోలీస్‌ సిబ్బంది అతడిని పైకి లేపారు. ఎక్కడి నుంచి వస్తున్నావని పోలీసులు ప్రశ్నించగా.. మీరేవరంటూ అతడు ఎదురు ప్రశ్నించాడు. పోలీసులమని సమాధానమివ్వగా.. ఐడీ కార్డు చూపించాలన్నాడు. కానిస్టేబుళ్లు ఎస్సైకి సమాచారం ఇవ్వగా.. అతడు కోరిన విధంగా కార్డు చూపించాలని సూచించారు. ఆ వ్యక్తి మద్యం తాగినట్లు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలో తేలింది. ఏకంగా 160 వరకు రీడింగ్ వచ్చిందని పోలీసులు తెలిపారు. వాహనం సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.

Read latest General News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని