Telangana News: రెండో రోజు ఎమ్మెల్యే మంచిరెడ్డిని 10గంటల పాటు విచారించిన ఈడీ

నిబంధనలకు విరుద్ధంగా విదేశాలకు నిధులు మళ్లించారన్న ఆరోపణలపై ఇబ్రహీంపట్నం (తెరాస) ఎమ్మెల్యే..

Published : 28 Sep 2022 20:36 IST

హైదరాబాద్‌: నిబంధనలకు విరుద్ధంగా విదేశాలకు నిధులు మళ్లించారన్న ఆరోపణలపై ఇబ్రహీంపట్నం (తెరాస) ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని హైదరాబాద్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు వరుసగా రెండో రోజు కూడా విచారించారు. బుధవారం ఉదయం 10 గంటల సమయంలో ఈడీ కార్యాలయానికి వచ్చిన ఆయనను రాత్రి 8 గంటల వరకు అధికారులు అనేక అంశాలపై ప్రశ్నించారు. బ్యాంకు ఖాతాలు, ఆర్థిక లావాదేవీల వివరాలను మంచిరెడ్డి ఈడీ అధికారులకు వివరించినట్టు సమాచారం. దాదాపు 10గంటల పాటు విచారించిన అనంతరం ఈడీ కార్యాలయం నుంచి ఎమ్మెల్యే వెళ్లిపోయారు. ఈ విషయంపై మాట్లాడేందుకు ఈడీ అధికారులు నిరాకరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని