Guntur: విద్యాశాఖ నిర్వాకం.. చనిపోయిన టీచర్‌కు ‘టెన్త్‌’ మూల్యాంకనం విధులు

చనిపోయిన మాస్టారుకు పదో తరగతి మూల్యాంకన విధులు కేటాయించడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది.

Updated : 18 Apr 2023 13:09 IST

గుంటూరు: చనిపోయిన మాస్టారుకు పదో తరగతి మూల్యాంకన విధులు కేటాయించడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్‌లోని ఎన్‌ఎస్‌ఎస్‌ఎం హైస్కూల్‌లో గణిత ఉపాధ్యాయుడు జి.నాగయ్య కొద్దికాలం కిందట చనిపోయారు. అయితే రేపటి నుంచి నిర్వహించనున్న పదో తరగతి మూల్యాంకన విధులు ఆయనకూ కేటాయిస్తూ జిల్లా విద్యాశాఖాధికారి ఉత్తర్వులిచ్చారు. 

దీనిపై ఆ పాఠశాల తల్లిదండ్రుల కమిటీ ఛైర్మన్‌ ఎం.రాజు సోమవారం స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. విధుల పట్ల విద్యాశాఖాధికారి నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయమై తెనాలి డివిజన్‌ ఉప విద్యాశాఖాధికారిణి నిర్మలను వివరణ కోరగా.. పాఠశాల నుంచి వచ్చిన జాబితాను పంపామని, రికార్డుల పరంగా ఆయన చనిపోయినట్లు ఎటువంటి ధ్రువపత్రం సమర్పించలేదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని