Andhra News: ఈటీవీపై అభిమానంతో.. మైక్రో ఆర్ట్‌ లోగోను తయారుచేసిన శ్రీకాకుళం వాసి

ఈనాడు టెలివిజన్ సంస్థలు ప్రారంభించి 27 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈటీవీపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు ఓ కళాకారుడు.

Updated : 27 Aug 2022 18:43 IST

పలాస: ఈనాడు టెలివిజన్ సంస్థలు ప్రారంభించి 27 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈటీవీపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు ఓ కళాకారుడు. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన కొత్తపల్లి రమేష్‌ ఆచారి అద్భుతమైన మైక్రో ఆర్ట్ కళారూపం తయారు చేశారు. సుమారు 150 మిల్లీగ్రాముల బంగారపు రేకుపై 1సెం.మీ ఎత్తు, 2సెం.మీ వెడల్పు ఉన్న ఈటీవీ లోగోను రూపొందించి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ లోగోను రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావుకు బహుమతిగా ఇవ్వడానికి తయారుచేసినట్లు రమేష్‌ తెలిపారు. దీన్ని తయారు చేయడానికి సుమారు 3గంటల సమయం పట్టిందన్నారు. ఈటీవీ అందిస్తున్న సేవలకు అభిమానంతో ఈ మైక్రో ఆర్ట్‌ను తయారు చేశానన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని