Shopping: పండగ జరుపుకొనేందుకు ఇలా సిద్ధమవ్వండి!

పండగ సంబరాలు మొదలయ్యాయి. మార్కెట్‌లో ఆఫర్ల జాతర ప్రారంభమైంది. పండగ రోజున అందంగా తయారవ్వాలని, మంచి బట్టలు వేసుకోవాలని ఇప్పటి నుంచే షాపింగ్‌ మొదలు పెడుతున్నారు అతివలు.

Published : 25 Sep 2022 01:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పండగ సంబరాలు మొదలయ్యాయి. మార్కెట్‌లో ఆఫర్ల జాతర ప్రారంభమైంది. పండగ రోజున అందంగా తయారవ్వాలని, మంచి బట్టలు వేసుకోవాలని ఇప్పటి నుంచే షాపింగ్‌ మొదలు పెడుతున్నారు అతివలు. ఇంటిని అలంకరించుకోవడం మొదలు పండగ అయ్యేంత వరకూ ఈ పని తేలేది కాదండోయ్‌! అయితే పండగకు షాపింగ్‌ చేసే ముందు ఈ విషయాలు గుర్తించుకోండి! 

అవసరం ఉన్నవి మాత్రమే..! 

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆఫర్ల జాతర సాగుతోంది. ఆఫర్లు ఉన్నాయని ఎక్కువగా కొనేయకండి! మీ దగ్గర ఉన్నబడ్జెట్‌ను బట్టి ఏం కొనాలో ప్రణాళిక వేసుకోండి. ఈ పండగకు మీరు ఎలా గడపాలనుకుంటున్నారు? ఎలా తయారవ్వాలనుకుంటున్నారు? ఇంటిని ఎలా అలంకరించాలనుకుంటున్నారు? మీ ఆలోచనలన్నింటినీ ఓ పేపరు మీద రాసుకోండి. ఇందులో అత్యవసరం అనుకున్నవాటిని మాత్రమే కొనండి. మిగతా వాటి అవసరం గుర్తించి కొనాలో వద్దో మీరే నిర్ణయించుకోండి! 

అయినవారి జ్ఞాపకంలా..! 

 పండగ అంటే కచ్చితంగా కొత్త బట్టలు కొనుక్కోవాలనే షరతులేం లేవు కదా! కొత్త బట్టలు లేకపోయినా కొత్తగా తయారవ్వచ్చు. అదెలా అంటారా? పాత బట్టల నుంచి కొత్త బట్టలు తయారు చేసుకోండి. అమ్మ, అమ్మమ్మల చీరలతో ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌ను బట్టి లంగావోణీలు, లాంగ్‌ ఫ్రాకులు కుట్టించుకోవచ్చు. అయినవారి జ్ఞాపకంలా అందమైన బట్టలు వేసుకోవచ్చు.  

మ్యాచింగ్‌ మ్యాచింగ్‌..! 

ఇంటిల్లిపాది మ్యాచింగ్‌ బట్టలు వేసుకోవాలనే ట్రెండ్‌ ప్రస్తుతం బాగా పాపులర్‌ అయింది. దీంతో ఏం కొన్నా అందరూ ఒకే విధంగా ఉండాలని అవసరం ఉన్నా లేకున్నా అన్నీ కొనేస్తుంటారు. ఏదైనా డ్రెస్‌కు మ్యాచింగ్‌గా ఆభరణాలు కొనాలనుకుంటే ముందుగా మీ దగ్గర ఏఏ వస్తువులు ఉన్నాయో చూడండి. ఈ పండగకు పనికొచ్చే వస్తువులు ఉంటే షాపింగ్‌ చేయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ మీ దగ్గర మీకు కావాల్సినవి లేకుంటే కొనేయండి! 

అందుబాటులో ఉండేలా..! 

హెయిర్‌ పిన్నులు, సారీ పిన్నులు, సేఫ్టీ పిన్నులు వంటివి ఎన్ని కొన్నా సరే.. సమయానికి అందుబాటులో ఉండవు. ఈసారి పండగకు అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే వీటన్నిటినీ ఒక బాక్స్‌లో, బ్యాగులో పెట్టండి. మీరు తయారయ్యే సమయంలో వాడుకోవడానికి సులువుగా ఉంటుంది.  

ఇంటిని అలకరించుకోండిలా..!  

పండగ వస్తుందంటే ఇంటిని కొత్త రంగులు వేసి, ఆకర్షణీయంగా ముస్తాబు చేసుకోవాలనుకుంటారు. కానీ రంగులేయకపోయినా ఇంటిని మెరిపించే పద్ధతులు ఉన్నాయి. వాల్‌ పేపర్లు గోడలకు అంటిస్తే చాలు ఇంటికి కొత్త కళ వచ్చేస్తుంది. మీకు నచ్చిన డిజైన్లలో ఎంపిక చేసుకోవచ్చు. తక్కువ బడ్జెట్లో ఇంటిని ఆకర్షణీయంగా మార్చాలనుకుంటే వాల్‌పేపర్లు ఉత్తమమైనవి.  

లేనివాళ్లకు ఇవ్వండి..! 

మీరు వాడని బట్టలు, ఆభరణాలను లేనివాళ్లకు, పేద వాళ్లకు ఇవ్వండి. పక్కన పెట్టిన వస్తువులు మరొకరి ఆనందానికి కారణం అవుతాయంటే మంచి విషయమే కదా! దీంతో కొత్త బట్టలు కొనుక్కునే స్తోమత లేని వాళ్లు కూడా ఆనందంగా పండగ జరుపుకొంటారు. 

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని